Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax Calculator: కొత్త ఆదాయపు పన్ను కాలిక్యులేటర్ మీ కోసం

మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా వేతనజీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఊహించని కానుక అందించారు. ఆదాయపన్ను విషయంలో ఆమె ఎంతో ఉదారంగా వ్యవహరించారు. భారతదేశ చరిత్రలో ఇంత వరకు ఎన్నడూ లేని రీతిలో ఆదాయపన్ను మినహాయింపును నిర్మలా సీతారామన్‌ భారీగా ప్రకటించారు.

Tax Calculator: కొత్త ఆదాయపు పన్ను కాలిక్యులేటర్ మీ కోసం
Tax Calculator
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 01, 2025 | 8:06 PM

ధరలు పెంచారా, తగ్గించారా అనే విషయాలు పక్కన పెడితే బడ్జెట్‌ అనగానే వేతనజీవులు ఆశగా ఎదురుచూసేది ఆదాయ పన్ను మినహాయింపు. ఈసారి వారి పంట పండింది. ఉద్యోగులు అధికంగా ఉండే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, త్వరలో జరిగే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని మధ్య తరగతి ప్రజలు ముఖ్యంగా వేతనజీవులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఊహించనంత భారీ ఊరట కల్పించింది. ఆదాయ పన్ను పరిమితిపై వస్తున్న రకరకాల ఊహాగానాలను తల్లకిందులు చేస్తూ ఏకంగా 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపును నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. స్టాండర్డ్‌ డిడక్షన్ 75 వేల రూపాయలు కలుపుకుంటే పన్ను మినహాయింపు పరిధి 12.75 లక్షలకు పెరగనుంది.

మీరు మీ ఆదాయపు పన్ను గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఎక్కడెక్కడో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మా కొత్త ఆదాయపు పన్ను కాలిక్యులేటర్ సహాయంతో, కొత్త పన్ను విధానంలో మీరు ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో మీరు సులభంగా తెలుసుకోవచ్చు.

ఆదాయపు పన్ను కాలిక్యులేటర్ దిగువన ఉంది

ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి కొత్త పన్ను స్లాబ్‌ను అమలు చేసింది, ఇందులో క్రింది రేట్లు సెట్ చేయబడ్డాయి:

పన్ను స్లాబ్ పన్ను రేటు
0-4 లక్షలు 0 శాతం
4-8 లక్షలు 5 శాతం
8-12 లక్షలు 10 శాతం
12-16 లక్షలు 15 శాతం
16-20 లక్షలు 20 శాతం
20-24 లక్షలు 25 శాతం
24 లక్షల కంటే ఎక్కువ 30 శాతం