Delhi Eletion-202: కేజ్రీవాల్‌కు షాక్ మీద షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఆప్ ఎమ్మెల్యేలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాత శనివారం (ఫిబ్రవరి 1) భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ ఎమ్మెల్యేలు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, బైజయంత్ జై పాండా సమక్షంలో కషాయాం పార్టీలో చేరారు. వారికి కాషాయం కండువా కప్పి కమ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాత శనివారం (ఫిబ్రవరి 1) భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ ఎమ్మెల్యేలు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, బైజయంత్ జై పాండా సమక్షంలో కషాయాం పార్టీలో చేరారు.
ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన నాయకులలో ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ, మాదిపూర్ నుండి గిరీష్ సోని, జనక్‌పురి ఎమ్మెల్యే రాజేష్ రిషి, బిజ్వాసన్ నుండి బిఎస్ జూన్, పాలెం ఎమ్మెల్యే భావన గౌర్, త్రిలోక్‌పురి నుండి రోహిత్ మెహ్రౌలియా, కస్తూర్బా నగర్ నుండి మదన్‌లాల్, మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ ఉన్నారు. .
శుక్రవారం (జనవరి 31) ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇస్తూ, 8 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారని, ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అవినీతి, ఇతర సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో లేరని, అందుకే వారికి ఎన్నికల టిక్కెట్లు ఇవ్వలేదని పార్టీ నిర్వహించిన సర్వేలో తేలిందని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి రీనా గుప్తా తెలిపారు. సర్వేలో ప్రతికూల ఫలితాలు రావడంతో మేం ఆయనకు టికెట్ ఇవ్వలేదన్నారు. టికెట్ రాకపోవడంతో ఇప్పుడు మరో పార్టీలో చేరడం పెద్ద విషయం కాదని, ఇది రాజకీయాల్లో భాగమే అని స్పష్టం చేశారు.
Prominent Personalities are joining BJP. @PandaJay @Virend_Sachdeva https://t.co/sl6uHjv4Dy
— BJP Delhi (@BJP4Delhi) February 1, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..