క్యాన్సర్ బాధితులకు బడ్జెట్ భరోసా.. వీడియో
ఇది ప్రజల బడ్జెట్. పద్దుని ప్రవేశపెట్టిన తరవాత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి. నిజంగానే..సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఊరటనిచ్చే నిర్ణయాలు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అందుబాటు ధరలో లేని వాటిని.. మధ్య తరగతి వాళ్లకి అందేలా కీలక ప్రకటనలు చేశారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ధరల గురించే.
క్యాన్సర్ మహమ్మారి ఎంత మంది ప్రాణాలు తీస్తోందో ఎన్నో రిపోర్ట్‌లు చెబుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు భారత్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సర్వికల్ క్యాన్సర్‌ని అరికట్టేందుకు కృషి చేస్తోంది. అయితే.. క్యాన్సర్ వచ్చిందంటే..ట్రీట్‌మెంట్ ఓ నరకం. పైగా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇది. సామాన్యులకు ఇలాంటి జబ్బులు వస్తే వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. క్యాన్సర్‌కి సంబంధించిన మందుల ధరలూ భారీగానే ఉంటాయి. మొత్తంగా…ఈ జబ్బు ప్రజల్ని శారీరకంగానే కాకుండా.. ఆర్థికంగానూ దెబ్బ తీస్తోంది. అందుకే..కేంద్రం ఈ సమస్యపై దృష్టి సారించింది. క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే ఆ మేరకు వాటి ధరలు తగ్గుతాయి. ఫలితంగా అవి సామాన్యులకు అందుబాటులోకి వచ్చేస్తాయి. అంతే కాదు. క్యాన్సర్ బాధితుల కోసం మరో కీలక ప్రకటన కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా 200 క్యాన్సర్ డే కేర్ సెంటర్స్‌ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!
రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు
చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది

