బడ్జెట్ 2024-25 హైలెట్స్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు అయ్యాక వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌పై కేంద్ర ప్రభుత్వంపై దేశ ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మోదీ ప్రభుత్వంపై ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు భారీ అంచనాలతో ఉన్నారు. ఆదాయపు పన్ను విధానంలో మార్పు ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే పన్ను రాయితీ, కొత్త పన్ను విధానంలో కూడా సడలింపు ఉంటుందని భావిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. సమీప భవిష్యత్తులో భారత్ మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది. అందుకే ఈ ఏడాది బడ్జెట్లో అందరికి మేలు జరిగే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది బడ్జెట్లో కార్మికవర్గంతోపాటు వ్యవసాయం, మహిళలు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ మధ్యతరగతి, సామాన్యులు, కార్పొరేట్, రైతు, సేవా రంగం, వ్యవసాయం, రైల్వే సేవలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. ఈ అన్ని రంగాలకు బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు? బడ్జెట్లో ఎవరికి ఎలాంటి లాభం చేకూరుతుంది? కొత్తగా ఎలాంటి ప్రకటనలు చేశారు? ఏది చౌకగా మారింది? ఏది ఖరీదైనది? తదితర అంశాలపై పూర్తి వివరాలు అందిస్తున్నాము.
-
ఇక చీప్‌గానే మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు.. భారీగా తగ్గనున్న ధరలు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాంకేతిక రంగానికి పెద్దపీట వేశారు. మొబైల్ ఫోన్లు, మొబైల్ PCBAలు, మొబైల్ ఛార్జర్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించారు
-
కేంద్ర బడ్జెట్లో ఉద్యోగ కల్పన, వ్యవసాయ రంగాలకు పెద్దపీట
కేంద్ర బడ్జెట్లో ఉద్యోగ కల్పనకు అత్యంత ప్రాధాన్యత కేంద్రం. యువతలో స్కిల్ డెవలప్మెంట్ , ఉపాధి కల్పన కోసం రూ. 2 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు
-
నిర్మలమ్మ పద్దులో తీపి కబురు.. వాహనదారులకు శుభవార్త..అదేంటంటే!
లిథియం, కాపర్, కోబాల్ట్, అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్‌తో సహా 25 కీలకమైన ఖనిజాలపై కస్టమ్స్ సుంకాలను పూర్తిగా మినహాయించాలని ప్రభుత్వం మంగళవారం ప్రతిపాదించింది
-
బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న ధరలు
పసిడి, వెండి కొనుగోలుదారులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గించారు
-
బడ్జెట్లో టూరిజం అభివృద్ధికి కేంద్రం పెద్దపీట
పార్లమెంట్లో 2024 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్. బడ్జెట్లో భాగంగా అన్ని వర్గాల వారికి అనుకూలమైన బడ్జెట్‌ను కేటాయిస్తూ ప్రకటించారు మంత్రి నిర్మలమ్మ
-
కేంద్ర బడ్జెట్లో మహిళలకు పెద్దపీట.. రూ. 3 లక్షల కోట్లతో.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కేంద్రం మహిళలకు, బాలికలకు పెద్దపీట వేసింది
-
వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు
పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2024 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలమ్మ రికార్డు సృష్టించారు
-
చరిత్ర సృష్టించిన నిర్మలమ్మ.. చీరచీరకో ప్రత్యేకత..!
గత ఆరేళ్లుగా బడ్జెట్ సమయంలో ఆమె ధరించిన చీరలు.. దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా కనిపిస్తున్నాయి. హుందాతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి
-
బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు.. రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు
పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు
-
బడ్జెట్లో 9 రంగాలకు ప్రాధాన్యత: ఆర్థిక శాఖ మంత్రి
పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2024 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలమ్మ రికార్డు సృష్టించారు.