AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సుదర్శన్ థియేటర్‌కు నెల కరెంట్ బిల్లు ఎంతొస్తుందో తెలుసా.? లెక్కలు చూస్తే ఆశ్చర్యం

హైదరాబాద్‌లో సుదర్శన్ థియేటర్ లాంటి సింగిల్ స్క్రీన్ల నిర్వహణ వ్యయాలు, ముఖ్యంగా కరెంట్ బిల్లులు, జీతాలు ఎలా ఉంటాయో.. ఆ థియేటర్ ఓనర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.

Hyderabad: సుదర్శన్ థియేటర్‌కు నెల కరెంట్ బిల్లు ఎంతొస్తుందో తెలుసా.? లెక్కలు చూస్తే ఆశ్చర్యం
Sudarshan 35mm
Ravi Kiran
|

Updated on: Feb 12, 2026 | 7:52 PM

Share

హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌కు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్లలోని ఈ థియేటర్‌లో 35MM, 70MM స్క్రీన్లు ఉన్నాయి. అయితే ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ నిర్వహణ వ్యయాలు, ముఖ్యంగా కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతాలు భారీగా భారాన్ని మోపుతాయని ఆ థియేటర్ ఓనర్ చెబుతున్నారు. ఒకప్పుడు నెలకు రూ. 5 లక్షల వరకు కేవలం ఎయిర్ కండిషనింగ్‌కే ఖర్చయ్యేదని చెప్పారు. అలాగే ఒక థియేటర్‌కు నెలకు రూ. 3 లక్షల వరకు కరెంట్ బిల్లు, రూ. 3-4 లక్షల వరకు జీతాలు అవుతున్నాయన్నారు.

కరెంట్ బిల్లుల విషయానికి వస్తే, 1983లో ఎన్టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం స్లాబ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, థియేటర్ ఆడినా, ఆడకపోయినా, సీట్ల సంఖ్య ఆధారంగా వారానికి, నెలకు ఒక నిర్ణీత పన్ను(సుమారు 15 శాతం) కట్టాల్సి వచ్చేది. దేవి 70mm థియేటర్(ఇనాగరేషన్ సమయంలో 1500 సీట్ల సామర్థ్యం, ప్రస్తుతం 1270) 1500 సీట్లకు పన్ను చెల్లించేది. అది ఆడినా ఆడకపోయినా. ఈ స్లాబ్ సిస్టమ్ కారణంగా చాలా థియేటర్లు దెబ్బతిన్నాయి. ఎయిర్ కండిషనింగ్‌తో నెలకు రూ. 4-5 లక్షల వరకు కరెంట్ బిల్లులు రావడంతో, చాలా థియేటర్లు ఎయిర్ కండిషన్డ్‌ను వదులుకుని, తక్కువ ఖర్చుతో కూడుకున్న ఎయిర్ కూలింగ్ సిస్టమ్‌కు మారాయి. ప్రస్తుతం ఒక థియేటర్‌కు నెలకు రూ. 3 లక్షల కరెంట్ బిల్లు, రూ. 3-4 లక్షల జీతాలు అవుతున్నాయి.

ఇతర ఖర్చులు కూడా కలుపుకుంటే, రాబడికి తగ్గ ఖర్చులు ఉండటం థియేటర్ల మనుగడకు సవాలుగా మారింది. ఆర్.టి.సి. క్రాస్ రోడ్ వంటి ప్రాంతాల్లో సుదర్శన్ థియేటర్ లాంటివి వరుసగా సినిమాలతో కొంతవరకు నెట్టుకుపోతున్నాయి. సినిమా రాబడి వారానికి కాగా, ఖర్చులు నెలవారీగా ఉండటంతో థియేటర్ల మనుగడ కష్టంగా మారిందని తెలిపారు. అటు పార్కింగ్, ఇటు క్యాంటీన్ ఆదాయంపైనే చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆధారపడుతున్నాయని అన్నారు. సినిమా లేనప్పుడు మూసేయడమే మంచిదని థియేటర్ యజమానులకు అర్థమైందని చెప్పుకొచ్చారు.