AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Induction Cooking: గ్యాస్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఇండక్షన్ స్టవ్ సరైనదేనా? దీని వెనక సైన్స్ ఏంటో చూడండి!

కాలం మారుతున్న కొద్దీ మన వంట పద్ధతులు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు కట్టెల పొయ్యి, తర్వాత కిరోసిన్, ఇప్పుడు గ్యాస్ స్టవ్‌లు వాడుతున్నాం. అయితే, ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం భద్రతా కారణాల దృష్ట్యా చాలామంది ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. గాజు పలకలా కనిపించే ఈ స్టవ్ వెనుక ఉన్న శాస్త్రీయ అద్భుతం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Induction Cooking: గ్యాస్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఇండక్షన్ స్టవ్ సరైనదేనా? దీని వెనక సైన్స్ ఏంటో చూడండి!
Benefits Of Induction Stove 2026
Bhavani
|

Updated on: Feb 12, 2026 | 7:35 PM

Share

ఇండక్షన్ స్టవ్ అనేది సాధారణ ఎలక్ట్రిక్ హీటర్ లాంటిది కాదు. ఇది ఒక ‘విద్యుదయస్కాంత క్షేత్రం’ ఆధారంగా పనిచేస్తుంది. దీనివల్ల స్టవ్ ఉపరితలం వేడెక్కదు కానీ, దానిపై ఉంచిన పాత్ర మాత్రమే వేడెక్కుతుంది. మరి ఇది అన్ని పాత్రలకు సపోర్ట్ చేస్తుందా? దీనివల్ల కరెంట్ బిల్లు భారీగా పెరుగుతుందా? ఇండక్షన్ స్టవ్ కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన లోటుపాట్లు ఏంటో ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం.

అయస్కాంత క్షేత్రం – అదృశ్య వేడి!

సాధారణ స్టవ్‌లలో కాయిల్ వేడెక్కి ఆ వేడి పాత్రకు అందుతుంది. కానీ ఇండక్షన్ స్టవ్ లోపల ఉండే కాయిల్ విద్యుత్ ప్రవహించినప్పుడు ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. మీరు దానిపై ఇనుము లేదా ఉక్కు పాత్రను ఉంచినప్పుడు, ఆ అయస్కాంత శక్తి నేరుగా పాత్రలోని అణువులను కదిలించి వేడిని పుట్టిస్తుంది. ఇక్కడ వింత ఏమిటంటే, స్టవ్ ఉపరితలం చల్లగా ఉన్నా లోపల పదార్థాలు మాత్రం మరుగుతుంటాయి.

ఏ పాత్రలు వాడాలి? చిన్న ట్రిక్ ఇక్కడ ఉంది!

ఇండక్షన్ స్టవ్ మీద అన్ని రకాల వంట సామాగ్రిని ఉపయోగించలేము. కేవలం అయస్కాంతం ఆకర్షించే పాత్రలే దీనిపై పనిచేస్తాయి. అల్యూమినియం, రాగి, మట్టి లేదా గాజు పాత్రలు దీనిపై వేడెక్కవు. మీ ఇంట్లో ఉన్న పాత్ర దీనికి పనికొస్తుందో లేదో తెలియాలంటే, ఒక చిన్న అయస్కాంతాన్ని పాత్ర అడుగున అతికించండి. అయస్కాంతం అంటుకుంటే ఆ పాత్ర ఇండక్షన్ స్టవ్‌కు పర్ఫెక్ట్ అని అర్థం.

భద్రత విషయంలో తిరుగులేదు!

ఇండక్షన్ స్టవ్  అతిపెద్ద ప్రయోజనం భద్రత. ఇందులో ఎటువంటి మంటలు ఉండవు కాబట్టి ప్రమాదాలు తక్కువ. స్టవ్ ఉపరితలం వేడెక్కదు కాబట్టి వంట చేస్తున్నప్పుడు పొరపాటున చేయి తగిలినా కాలిపోదు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారికి ఇది చాలా సురక్షితం. అంతేకాకుండా, గ్యాస్ స్టవ్ కంటే ఇది వేగంగా వంటను పూర్తి చేస్తుంది, దీనివల్ల సమయం కూడా ఆదా అవుతుంది.

కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి..

దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. గ్యాస్ స్టవ్‌తో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ కొంచెం ఖరీదైనది. దీని కోసం ప్రత్యేకంగా ఇండక్షన్ బేస్ ఉన్న పాత్రలను కొనుగోలు చేయడానికి విడిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే, గ్యాస్ స్టవ్ మీద నిప్పు మీద వంట చేయడం అలవాటు పడిన వారికి, నిప్పు లేకుండా వంట చేయడం మొదట్లో కొంచెం వింతగా అనిపించవచ్చు.

ఇండక్షన్ స్టవ్‌కు మారడం తెలివైన పనేనా?

పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ల ధరలు   పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుంటే ఇండక్షన్ స్టవ్‌కు మారడం మంచి నిర్ణయమే. ప్రారంభంలో పెట్టుబడి కొంచెం ఎక్కువ అనిపించినా, దీర్ఘకాలంలో ఇది డబ్బు సమయాన్ని ఆదా చేస్తుంది. విద్యుత్ వినియోగం కూడా సమర్థవంతంగా ఉండటం వల్ల కరెంట్ బిల్లుపై పెద్దగా భారం పడదు.