AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..

ప్రశాంతమైన నిద్ర కోసం మీరు మాత్రలు వాడుతున్నారా..? అయితే ఒక్క నిమిషం ఆగండి.. మీ ఇంట్లో లభించే నీళ్లతోనే మీ నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. రాత్రి పడుకునే ముందు పాదాలను కడుక్కోవడం వల్ల మీ మెదడుకు అందే ఆ ప్రశాంతత సందేశం ఏంటీ..? శరీర ఉష్ణోగ్రతను ఇది ఎలా నియంత్రిస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
Washing Feet Before Bed Benefits
Krishna S
|

Updated on: Apr 03, 2026 | 9:57 PM

Share

మనం అందం అనగానే కేవలం ముఖానికే ప్రాధాన్యత ఇస్తాం. కానీ రోజంతా మన శరీర బరువును మోస్తూ, మనల్ని నడిపించే పాదాలను మాత్రం పట్టించుకోం. అయితే రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రం చేసుకోవడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు.. అది ఒక అద్భుతమైన ఆరోగ్య రహస్యం. ఆయుర్వేదంతో పాటు ఆధునిక వైద్య శాస్త్రం కూడా రాత్రి పూట పాదాలు కడుక్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలను చూసి ఆశ్చర్యపోతోంది.

నిద్రలేమికి సహజ చికిత్స

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నిద్రలేమి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో పాదాలను కడుక్కోవడం వల్ల పాదాలలోని రక్తనాళాలు విశ్రాంతి పొందుతాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసి మెదడుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. దీనివల్ల పీడకలలు రాకుండా గాఢమైన నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడి మాయం.. మనసు ప్రశాంతం

మన పాదాలలో వందలాది నరాల కొనలు ఉంటాయి. రోజంతా పని ఒత్తిడితో అలసిపోయినప్పుడు, పాదాలను కడగడం వల్ల ఆ నరాలన్నీ ఉత్తేజితమై కండరాలు విశ్రాంతి పొందుతాయి. ఇది శరీరంలో ఒత్తిడి హార్మోన్లను తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇది ఒక చిన్నపాటి హోమ్ థెరపీలా పనిచేస్తుంది.

పాదాల మంటలు, కండరాల నొప్పుల నుండి రిలీఫ్

చాలా మందికి రాత్రి పూట పాదాలు మండుతుంటాయి. అలాంటి వారు చల్లటి నీటితో పాదాలు కడుక్కుంటే శరీరంలోని అధిక వేడి తగ్గి, హాయిగా ఉంటుంది. అలాగే రోజంతా నిలబడి పనిచేసే వారికి వచ్చే కండరాల నొప్పుల నుండి ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడి, ఉదయం లేవగానే కాళ్లు చాలా తేలికగా అనిపిస్తాయి.

ఇన్ఫెక్షన్లకు చెక్..

రోజంతా బూట్లు, చెప్పులు వేసుకోవడం వల్ల పాదాలపై బ్యాక్టీరియా, చెమట పేరుకుపోతాయి. దీనివల్ల పాదాల దుర్వాసన, చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. రాత్రి పూట పాదాలు కడగడం వల్ల చర్మానికి గాలి ఆడుతుంది. మడమల పగుళ్లు నివారించబడి, పాదాలు మృదువుగా, అందంగా మారుతాయి.

ఆరోగ్య చిట్కాలు

తప్పనిసరిగా తుడవండి: పాదాలు కడుక్కున్న తర్వాత పొడి గుడ్డతో పూర్తిగా తుడుచుకోవాలి. తడి ఉంటే వేళ్ల మధ్య ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

మసాజ్ చేయండి: వీలైతే పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్ రాసి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మరింత మెరుగుపడుతుంది.

నీటి ఉష్ణోగ్రత: హాయిగా ఉండాలంటే గోరువెచ్చని నీటిని, శరీర వేడి తగ్గాలంటే చల్లటి నీటిని వాడటం ఉత్తమం.

Follow Us