AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్..! కేంద్రం షాకింగ్ డెసిషన్.. మీ పేరు చెక్ చేస్కోండి..

రైతులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. అక్టోబర్ 30వ తేదీన పీఎం కిసాన్ నగదు సాయం రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ కానుంది. ఈ క్రమంలో లబ్దిదారుల సంఖ్య భారీగా తగ్గింది. గత విడతతో పోలిస్తే లబ్దిదారుల సంఖ్య తగ్గిపోయింది. అనర్హులుగా తేలడంతో తొలగించినట్లు తెలుస్తోంది.

Venkatrao Lella
|

Updated on: Oct 29, 2026 | 7:18 AM

Share
దేశంలో ఎల్‌నివో పరిస్థితులు, వర్షాలు పడక రైతులు పంట సాగుకు దూరమైన క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ సాయాన్ని అక్టోబర్ 30వ తేదీన విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆరోజున గుజరాత్‌లోని బనాస్ కాంఠాలో జరగనున్న క్రమంలో ప్రధాని మోదీ స్వయంగా ఈ నిధులను రిలీజ్ చేయనున్నారు. దీంతో ఆ రోజు రైతుల బ్యాంక్ అకౌంట్లలో రూ.2 వేల ఆర్ధిక సాయం పడనుంది. ఈ నిధుల కోసం లబ్దిదారులందరూ ఎదురుచూస్తున్నారు.

1 / 5
గత ఏడాది నవంబర్ 19వ తేదీన 21వ విడత నిధులు పడగా.. ఈ సారి 20 రోజుల ముందుగానే కేంద్రం రైతుల అకౌంట్లలో నిధులు జమ చేస్తోంది. 23వ విడత నిధులను ఈ ఏడాది జూన్ 20వ తేదీన మోదీ రిలీజ్ చేశారు. ఇప్పుడు అక్టోబర్ 20వ తేదీతో నాలుగు నెలలు పూర్తయింది. కేంద్రం ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి అకౌంట్లలో డబ్బులు వేస్తోంది. గత విడత జారీ చేసి 4 నెలలు పూర్తవ్వడంతో కేంద్రం 24వ విడత సొమ్మును ఇప్పుడు విడుదల చేస్తోంది. పండక్కి ముందే అకౌంట్లలో డబ్బులు పడనుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

2 / 5
అయితే కేంద్రం అనర్హులైన 10 లక్షల మంది పేర్లను పీఎం కిసాన్ లబ్దిదారుల జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. 23వ విడతలో 9.44 కోట్ల మంది లబ్దిదారులకు అందించారు. కానీ 24వ విడతలో 9.34 కోట్ల మంది లబ్దిదారులకు రూ.18680 కోట్లు అందించనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. గత విడతతో పోలిస్తే లబ్దిదారుల సంఖ్య 10 లక్షలకు తగ్గింది. దీనిని బట్టి చూస్తే వివిధ కారణాలతో అనర్హులుగా తేలడంతో వీరిని తొలగించినట్లు తెలుస్తోంది.

3 / 5
కేంద్రం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అనర్హులను తొలగిస్తూ వస్తోంది. ఈకేవైసీ చేసుకోనివారు, వ్యవసాయ భూమి రికార్డులను పీఎం కిసాన్ పోర్టల్‌లో అనుసంధానం చేయనివారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్దిదారులుగా ఉండటం వంటి కారణాలతో తొలగిస్తున్నారు. ఇక వాలెంటరీ సరెండర్ ఆప్షన్ ద్వారా మరికొంతమంది స్వయంగా వదులుకుంటున్నారు. పీఎం కిసాన్ లబ్దిదారులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.

4 / 5
పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. ఇక కామన్ సర్వీస్ సెంటర్లను ఆశ్రయించి కూడా  ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. అలాగే డీబీటీ ప్రక్రియ ద్వారా మీ అకౌంట్లో డబ్బులు పడాలంటే బ్యాంక్ అకౌంట్-ఆధార్ లింకింగ్ తప్పనిసరి. అలాగే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదై ఉండాలి. బెనిఫిషియరీ  స్టేటస్‌లోకి వెళ్లి లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు

5 / 5
Follow Us
రైతులకు కేంద్రం బ్యాడ్‌న్యూస్. 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్..!

పరగడుపున కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..? శరీరంలో జరిగే మార్పులివే!

బియ్యంలో పురుగులు పడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో అస్సలు రావు

దీపావళి సేల్.. ఐఫోన్ 17, శాంసంగ్ S25 FE ఫోన్‌లపై భారీ తగ్గింపులు

తుఫాన్ ప్రభావిత జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన!

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు..

నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..

Nothing Ear (3) Pro ధర అదిరిపోతోందిగా
Nothing Ear (3) Pro ధర అదిరిపోతోందిగా
వామ్మో.. వాళ్లిద్దర్ని చూస్తే నాకే భయమేసింది..: శ్రేయాస్ అయ్యర్

గ్యాస్ కనెక్షన్‌దారుడు మరణిస్తే కుటుంబ సభ్యులకు సబ్సిడీ వస్తుందా?