AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళికి ఇల్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ పక్కన కనిపించిన ఊహించని అతిథులు

దీపావళి పండుగ దగ్గరకొచ్చింది. దీంతో చాలా మంది ఇప్పటి నుంచే ఇళ్లు క్లీన్ చేయడం మొదలు పెట్టారు. ఇలానే ఇంటిని శుభ్రం చేస్తున్న ఓ వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. అతని ఇంట్లో ఏకంగా ఆరు గుడ్లగూబ పిల్లలు కనిపించాయి. అది చూసి ఆశ్చర్యానికి గురైన ఇండి యజమాని వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అధికారులు వాటిని సురక్షితంగా రక్షించి తీసుకెళ్లారు.

దీపావళికి ఇల్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ పక్కన కనిపించిన ఊహించని అతిథులు
Six Barn Owl Chicks Rescued During Diwali Cleaning In Bijnor
Anand T
|

Updated on: Oct 29, 2026 | 8:06 AM

Share

దీపావళికి ఇళ్లు క్లీన్ చేస్తుండగా ఇంట్లో ఆరు గుడ్లగూబ పిల్లలు కనిపించిన ఆశ్చర్యఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బిజ్నోర్‌లో ఉన్న కృష్ణ విహార్ కాలనీకి చెందిన జగదీశ్ కుమార్ అనే వ్యక్తి.. దీపావళి పండుగ దగ్గర పడుతుందని ఇంటిని శుభ్రం చేయడం స్టార్ట్ చేశాడు.. అయితే ఇంటిలోని ఓ పాత కిటికీలో గుడ్లగూబకు చెందిన ఆరు పిల్లలు కనిపించాయి. వాటిని చూసిన జగదీశ్ తొలుత ఆశ్చర్యపోయాడు. ఆ కిటికీకి జాలీ ఉండటంతో తల్లి గుడ్లగూబ తన పిల్లల వద్దకు రాలేకపోతుందని.. పిల్లలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన జగదీశ్ కుమార్ వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ బృందం వెంటనే అక్కడికి చేరుకుని ఆరు గుడ్లగూబ పిల్లలను సురక్షితంగా బయటకు తీసింది. అనంతరం వాటిని సంరక్షణ కోసం అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి తరలించింది. అటవీ ప్రాంతాధికారి మహేశ్ గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. రక్షించిన ఆరు గుడ్లగూబ పిల్లలు బార్న్ ఔల్ జాతికి చెందిని.. వీటిలో నాలుగు మగవి, రెండు ఆడవి ఉన్నట్టు తెలిపారు.

వాటిని రెండు పంజరాల్లో ఉంచి అటవీ శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వాటి ఆరోగ్యం, ఆహారం, ఇతర అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సహజ వాతావరణానికి దూరంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ గుడ్లగూబ పిల్లల ఆహారపు అలవాట్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయని అధికారులు తెలిపారు. సాధారణంగా ఇవి పగటిపూట విశ్రాంతి తీసుకుంటూ.. చీకటి పడిన తర్వాత ఆహారం కోసం చూస్తాయని తెలిపారు. ఈ అలవాటును దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ సిబ్బంది సాయంత్రం వేళ వాటికి ఆహారం అందిస్తున్నారు.

మొదట ఈ ఆరు పిల్లలకు రోజుకు సుమారు అర కిలో చికెన్ ఇచ్చేవారు. అయితే వాటి ఆహార అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం ఆ పరిమాణాన్ని పెంచారు. ఇప్పుడు ప్రతిరోజూ దాదాపు ఒక కిలో చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి ఆహారంగా అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అవి పూర్తిగా ఎదిగిన తర్వాత సహజ ఆవాసంలోకి విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
క్యాన్సర్ రోగులకు ఉపశమనం: 543 రకాల మందుల ధరలు భారీగా తగ్గింపు
క్యాన్సర్ రోగులకు ఉపశమనం: 543 రకాల మందుల ధరలు భారీగా తగ్గింపు
త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఏ విధంగా తయారవుతాయంటే
త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఏ విధంగా తయారవుతాయంటే
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. ఇవి తప్పనిసరి
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. ఇవి తప్పనిసరి
దీపావళికి ఇల్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ ఓపెన్ చేయగా..
దీపావళికి ఇల్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ ఓపెన్ చేయగా..
పన్నీర్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకాలపై ఏడాదిపాటు బ్యాన్..
పన్నీర్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకాలపై ఏడాదిపాటు బ్యాన్..
Video: రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. స్పెయిన్‌లో 68 మంది మృతి!
Video: రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. స్పెయిన్‌లో 68 మంది మృతి!
కర్వా చౌత్.. చంద్రోదయం సమయం, పూజా ముహూర్తం, వ్రత నియమాలు ఇవే!
కర్వా చౌత్.. చంద్రోదయం సమయం, పూజా ముహూర్తం, వ్రత నియమాలు ఇవే!
35 ఏళ్ల తర్వాత అద్భుతం.. అసలెవరీ నయా ఆల్ రౌండర్..!
35 ఏళ్ల తర్వాత అద్భుతం.. అసలెవరీ నయా ఆల్ రౌండర్..!
స్క్రీన్ చూస్తుంటే కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయా? కారణం ఇదే!
స్క్రీన్ చూస్తుంటే కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయా? కారణం ఇదే!
రైతులకు కేంద్రం బ్యాడ్‌న్యూస్. 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్..!
రైతులకు కేంద్రం బ్యాడ్‌న్యూస్. 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్..!