కాకినాడ జిల్లా కత్తిపూడి శివారులోని పాతకొత్తూరులో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు బంధువుల అంత్యక్రియలకు తణుకు వెళ్లిన సమయంలో దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి పది తులాల బంగారం, 500 గ్రాముల వెండి, నగదు, సెల్ఫోన్లను అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.