నడిరోడ్డుపై పడగ విప్పిన నాగుపాము.. కోయంబత్తూరులో కలకలం

×

నడిరోడ్డుపై పడగ విప్పిన నాగుపాము.. కోయంబత్తూరులో కలకలం

తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ నాగుపాము కలకలం రేపింది. ప్రధాన రహదారిని దాటేందుకు ప్రయత్నిస్తున్న నాగుపామును ఓ వాహనం ఢీకొట్టడంతో అది గాయపడింది. దీంతో నడిరోడ్డుపైనే తల పైకెత్తి పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది. ఈ ఘటనతో రహదారిపై వెళ్తున్న వాహనదారులు అప్రమత్తమయ్యారు. రోడ్డుపై పాము ఉండటంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఇలాంటి సందర్భాల్లో పాములకు దగ్గరగా వెళ్లకుండా, వాటిని పట్టుకునే ప్రయత్నం చేయకుండా అటవీశాఖ లేదా పాములను రక్షించే నిపుణులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

Janardhan Veluru