Video: రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. స్పెయిన్‌లో 68 మంది మృతి!
స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో కనీసం 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మాడ్రిడ్ నుంచి సెవిల్లెకు వెళ్లే హైస్పీడ్ రైలు మార్గంలో ఆగి ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు దాదాపు 200 కి.మీ వేగంతో ఢీకొట్టింది! సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్య తలెత్తినప్పుడు జరిగిన మానవ తప్పిదం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో కనీసం 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మాడ్రిడ్ నుంచి సెవిల్లెకు వెళ్లే హైస్పీడ్ రైలు మార్గంలో ఆగి ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు దాదాపు 200 కి.మీ వేగంతో ఢీకొట్టింది! సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్య తలెత్తినప్పుడు జరిగిన మానవ తప్పిదం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
రెన్ఫే (Renfe) సంస్థకు చెందిన హైస్పీడ్ రైలు దక్షిణ దిశగా ప్రయాణిస్తుండగా.. పట్టాలపై ఆగి ఉన్న ఇరియో (Iryo) రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కొన్ని రైలు బోగీలు పట్టాల పక్కన లోతైన ప్రాంతంలో పడిపోయాయి. ప్రమాదంలో కనీసం 68 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో రెన్ఫే రైలులో 397 మంది, ఇరియో రైలులో 147 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఉదయం 8.30 గంటల సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రైలు మార్గంలోని 63 కిలోమీటర్ల పరిధిలో భద్రతా వ్యవస్థ పనిచేయడం ఆగిందని రైల్వే మంత్రి ఆస్కార్ పుయెంటె తెలిపారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్లన్నీ నిలిచిపోయాయి. ఆ తర్వాత రెన్ఫే రైలును నడపాలని కేంద్ర నియంత్రణ విభాగం నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే, వేగంపై ఎలాంటి పరిమితులు విధించకుండానే రైలును ముందుకు వెళ్లనిచ్చినట్లు సమాచారం. దాంతో ఉదయం 8.53 గంటలకు రెన్ఫే రైలు పట్టాలపై నిలిచివున్న ఇరియో రైలును బలంగా ఢీకొట్టింది.
ఆ మార్గంలో అప్పటికీ ‘స్టాప్ సిగ్నల్’ ఉన్నందున రెన్ఫే రైలును ముందుకు వెళ్లమని ఆదేశించి ఉండకూడదనీ ఒకవేళ రైలును నడపాలని నిర్ణయించినా.. వేగాన్ని తగ్గించి వెళ్లాలని సూచించాల్సిందని రైల్వే మంత్రి పుయెంటె అభిప్రాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు ఎంత వేగంతో ప్రయాణిస్తోందనే విషయాన్ని అధికారులు ఇంకా పరిశీలిస్తున్నారని, గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళుతూ ఉండవచ్చని అన్నారు. ఈ ఘటనలో ఎవరినీ బాధ్యులుగా చేయడం లేదని, తనకు తెలిసిన వాస్తవాలను మాత్రమే వెల్లడిస్తున్నట్లు పుయెంటె స్పష్టం చేశారు.
‼️Accidente tren
🚨 La Guardia Civil ha desplegado en la zona personal de Seguridad Ciudadana de la provincia de Toledo, OMAC (Oficinas Móviles de Atención a la Ciudadanía) así como agentes del SEPRONA y de la Jefatura de Tráfico.
✔️ También se desplazan a la zona en este momento unidades de Seguridad Ciudadana de Ciudad Real y Albacete, de los Grupos de Reserva y Seguridad (GRS), del Servicio Aéreo, de drones, grupo de Caballería y el Equipo de Grandes Catástrofes del Servicio de Criminalística, del Servicio Cinológico y de Policía Judicial.
— Guardia Civil (@guardiacivil) October 28, 2026
సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్యే కారణమా?
ప్రమాదానికి మానవ తప్పిదం కారణమై ఉండొచ్చని స్పెయిన్ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఓకేడియారియో (Okdiario) వార్తా సంస్థ కథనంలో తెలిపింది. ప్రధాన సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్య తలెత్తిన సమయంలో రైల్వే ఆపరేటర్ తీసుకున్న నిర్ణయంలో పొరపాటు జరిగి ఉండవచ్చని స్పష్టం చేసింది. అయితే దర్యాప్తు తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రమాదం నేపథ్యంలో మాడ్రిడ్ నుంచి సియుడాడ్ రియల్, అండలూసియా ప్రాంతాలకు వెళ్లే రైళ్లను నిలిపివేశారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్పెయిన్ ప్రధాని!
ఈ ఘోర ప్రమాదంపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యవసర సేవల సిబ్బంది ఘటనాస్థలిలో పనిచేస్తున్నారని రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటెతో పాటు కాస్టిల్లా-లా మాంచా ప్రాంత అధ్యక్షుడితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాననీ, బాధితులు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఎక్స్‌లో పోస్టు చేసారు.
ఈ ఏడాది స్పెయిన్‌లో రెండో ఘోర రైలు ప్రమాదం!
స్పెయిన్‌లో ఈ ఏడాది హైస్పీడ్ రైలు మార్గంలో చోటుచేసుకున్న ఇది రెండో భారీ ప్రమాదం. జనవరిలో అడముజ్ ప్రాంతంలో రైలు పట్టాలు తప్పి, అనంతరం మరో రైలును ఢీకొన్న ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. రైలు ప్రయాణాలను వేగంగా, సౌకర్యవంతంగా మార్చిన హైస్పీడ్ నెట్‌వర్క్‌లో ప్రమాదం జరగడం ప్రయాణికుల్లో భయాందోళనలు పెంచుతోంది.