AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metro: మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష ఉంటుంది..? రూల్స్ మార్చిన కేంద్రం.. కొత్త నిబంధనలు ఇలా..

కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ట్రస్ట్(సవరణ) బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించింది. దీంతో చిన్న నేరాలకు పాల్పడేవారికి ఊరట కలిగినట్లయింది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం, శబ్ద, వాయు కాలుష్యంతో పాటు చిన్న చిన్న నేరాలకు పాల్పడేవారికి ఉపశమనం లభించింది. కేంద్రం తెచ్చిన చట్టంతో ఎలాంటి మార్పులు వచ్చాయంటే..

Metro: మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష ఉంటుంది..? రూల్స్ మార్చిన కేంద్రం.. కొత్త నిబంధనలు ఇలా..
metro
Venkatrao Lella
|

Updated on: Apr 03, 2026 | 9:42 PM

Share

పార్లమెంట్ ఇటీవల పబ్లిక్ ట్రస్ట్(సవరణ) బిల్లు, 2026కు ఆమోదం తెలిపింది. 79 కేంద్ర చట్టాల్లోని 784 సెక్షన్లను ఇది సవరిస్తుంది. దీని ప్రకారం వెయ్యి చిన్న నేరాలను నేరరహితం చేవారు. అంటే చిన్న నేరాలకు పాల్పడితే జైలుశిక్ష అనేది పడదు. జరిమానా విధించడం, హెచ్చరిక జారీ చేయడం లాంటివి చేస్తారు. కోర్టులపై భారాన్ని తగ్గించడం, చిన్న నేరాలకు సంబంధించి చట్టపరమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఈ సవరణలు తీసుకొచ్చింది. ప్రజల జీవితాన్ని సులభతరం చేయడం, పరిపాలన ప్రక్రియను క్రమబద్దీకరించడం కోసం ఇవి సహాయపడనున్నాయి.

మెట్రోలో సిగరేట్ తాగితే..

మెట్రోలు లేదా బహిరంగ ప్రదేశాల్లో సిగరేట్ తాగడం వంటి మొదటిసారి చేసే నేరాలకు ఇకపై జైలుశిక్ష ఉండదు. కేవలం జరిమానా, హెచ్చరికలు వంటి చర్యలు తీసుకుంటారు. ఇక వాయు, శబ్ద కాలుష్యానికి సంబంధించి మొదటిసారి చేసిన తప్పుకు జరిమానా విధిస్తారు. పదే పదే ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి. వీటి వల్ల న్యాయవ్యవస్థపై ఒత్తిడి తగ్గి కేసులు వేగవంతంగా పరిష్కారం అవుతాయి. కొత్త చట్టం తర్వాత పాత కేసులన్నీ ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. అటువంటి కేసులను గుర్తించి వాటిని ఉపసంహరించుకోవడంపై కోర్టుల్లో దరఖాస్తులు దాఖలు చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా 5 కోట్ల చిన్న నేరాల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అసలు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేని కేసులుగా వీటిని గుర్తించారు. కొత్త నిబంధనలతో ఈ కేసులు త్వరగా పరిష్కారం కానున్నాయి.

మార్పులు ఇవే..

-57 సెక్షన్లలో జైలు శిక్ష పూర్తగా రద్దు

-158 సెక్షన్లలో జరిమానా తగ్గింపు

-17 కేసుల్లో శిక్ష తగ్గింపు

-113 కేసుల్లో జైలుశిక్ష, జరిమానాకు బదులుగా కేవలం శిక్ష మాత్రమే విధింపు

Follow Us