AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakasa Review: రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా

Rakasa Review: రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా

Phani CH
|

Updated on: Apr 03, 2026 | 9:24 PM

Share

రాకాస సినిమా రివ్యూ: నిహారిక కొణిదెల నిర్మాణంలో మానస శర్మ దర్శకత్వం వహించిన 'రాకాస' ఒక ఫాంటసీ థ్రిల్లర్. జానపద కథల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రం కామెడీ, థ్రిల్స్‌తో ఆకట్టుకుంటుంది. సంగీత్ శోభన్ నటన, వెన్నెల కిషోర్ కామెడీ ప్రధాన ఆకర్షణలు. కథనం నెమ్మదించినా, పండించే నవ్వులు, నిర్మాణ విలువలు సినిమాను సమ్మర్ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయి.

కమిటీ కుర్రోళ్లు లాంటి క్లీన్ సినిమా తీసి నిర్మాతగా తన అభిరుచిని నిరూపించుకున్న నటి.. నిహారిక కొణిదెల. తాజాగా, తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి జీ స్టూడియోస్‌తో కలిసి చేసిన ప్రయత్నమే రాకాస. మానస శర్మ అనే కొత్త దర్శకురాలు ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ ఫాంటసీ థ్రిల్లర్ ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. రాకాస కథ విషయానికి వస్తే.. జానపద కథలు, చందమామ కథల స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రమే రాకాస.!! అనగనగా ఒక ఊరు.. ఆ ఊరిలో ఓ పాత కోట.. ఆ కోటలో బ్రహ్మ రాక్షసుడు నివసిస్తుంటాడు. కొన్ని వందల ఏళ్లకు ఒకసారి ఆ రాక్షసుడు మూడు హెచ్చరికలు పంపుతాడు. మూడో హెచ్చరిక వచ్చేసరికి ఊరివాళ్లు ఒక మనిషిని అతనికి ఆహారంగా పంపాలి. లేదంటే ఊరిని నాశనం చేస్తాడు. సరిగ్గా అదే సమయానికి అమెరికా నుంచి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఊరికి వచ్చిన వీరబాబు అలియాస్ సంగీత్ శోభన్ ఊహించని పరిస్థితుల్లో ఆ రాక్షసుడికి ఆహారంగా కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత లోపల ఏం జరిగింది? రాక్షసుడిని వీరబాబు ఎలా ఎదిరించాడు? మధ్యలో సుబ్బలక్ష్మి అలియాస్ నయన్ సారిక ఎందుకొచ్చింది..? అసలు ఆ కోటలోకి వెళ్లిన తర్వాత ఏం జరిగింది..? అనేది మిగతా కథ. చిన్నపుడు పుస్తకాల్లో చదువుకునే వాళ్లం కదా.. అక్కడ ఓ కోట ఉందంట.. అందులో దెయ్యం ఉందంట.. బ్రహ్మ రాక్షసుడు వచ్చి మనషులను తినేస్తాడంట అని.. అచ్చంగా అలాంటి కథల నుంచి స్పూర్తి పొంది రాసుకున్న కథ ఇది. మానస శర్మ ఈ కథను రాసుకున్న తీరు కంటే దాన్ని మంచి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, సంగీత్ శోభన్ మార్క్ కామెడీ ట్రాక్స్, సరదా ఎలిమెంట్స్‌తో సినిమా చాలా లైట్ మూడ్‌లో ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చే ట్విస్ట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. సెకండ్ హాఫ్ అంతా నలుగురు చుట్టూనే కథ తిరుగుతుంది. మరీ ముఖ్యంగా హీరో కోటలోకి వెళ్ళాక కథ కాస్త నెమ్మదించినట్లు, ఫ్లాట్‌గా మారినట్లు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే వెన్నెల కిషోర్ పాత్ర ఎంటర్ అయిందో అక్కడ్నుంచి మళ్లీ వేగం పుంజుకుంటుంది. ఇక గెటప్ శ్రీను ఎంట్రీతో వచ్చే కామెడీ సీన్స్ సినిమాను మళ్ళీ ట్రాక్‌లోకి తెస్తాయి. అయితే క్లైమాక్స్‌ని ఎవరూ ఊహించని విధంగా ఎమోషనల్ అండ్ డ్రామాతో బాగా ముగించారు డైరెక్టర్ మానస. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా రాజు ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. సంగీత్ శోభన్ ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, న్యాచురల్ కామెడీ టైమింగ్‌తో సినిమాను తన భుజాలపై నడిపించాడు. కథలో కీలక మలుపులకు కారణమయ్యే పాత్రలో తన పరిధి మేరకు చక్కగా నటించింది నయన్ సారిక. వెన్నెల కిషోర్ & గెటప్ శ్రీను! సెకండాఫ్‌లో వీళ్ళ కామెడీ టైమింగ్ సినిమాకి ప్రాణం పోసింది. థియేటర్లలో వీళ్లు ఉన్నంత సేపు నవ్వులు పూస్తాయి. మిగిలిన పాత్రలు కూడా తమ పరిధి మేరకు మెప్పించాయి. అనుదీప్ దేవ్ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.. ఎడిటింగ్ బాగుంది. రన్ టైమ్ చాలా తక్కువగానే ఉండటం ప్లస్ పాయింట్. ఇక దర్శకురాలు మానస శర్మ మొదటి సినిమాతోనే మెప్పించింది. విట్టలాచార్య తరహా చందమామ కథల కాన్సెప్ట్‌ను ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్లు క్లీన్ కామెడీతో బాగా డీల్ చేశారు ఆమె.అయితే సెకండాఫ్‌లో చిన్నపాటి తడబాటు ఉన్నా, ఓవరాల్‌గా డైరెక్టర్‌గా మంచి మార్కులు కొట్టేశారు. ‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నిహారిక ఈ విషయంలో కాంప్రమైజ్ కాలేదని చూస్తుంటే తెలుస్తోంది. బడ్జెట్ పరిమితుల్లోనే VFX, రాక్షసుడి డిజైన్ వంటివి చాలా నీట్‌గా తీసుకువచ్చారు. ఓవరాల్‌గా చెప్పాలంటే రాకాస.. ఫన్ ఫాంటసీ సమ్మర్ ఎంటర్టైనర్.. నో లాజిక్ ఓన్లీ కామెడీ..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Biker Review: రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు

కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా

వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త

ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా

అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. దీని సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు

Follow Us