ఇలా చేస్తే చాలు.. కనకాంబరాలు గుత్తులు గుత్తలుగా పూస్తాయి!

Samatha

03 April 2026

కనకాంబరం పూలను ఇష్టపడని వారు ఎవరుంటారు. పల్లె నుంచి పట్నం వరకు ప్రతి ఒక్కరికీ కనకాంబరాలు ఇష్టం ఉంటుంది.

కనకాంబరం పూలు

చాలా మంది వీటిని ఇంటి వద్ద పెంచుకొని, పూలను అందంగా మాలలా అల్లుకొని నెత్తిన పెట్టుకుంటారు.

పూలు

ఇక కనకాంబరాలు ఎప్పుడూ గుత్తులు గుత్తులుగా పూస్తుంటాయి. అయితే సమ్మర్‌లో మాత్రం పూలు ఎక్కువగా పూయడం తగ్గుతుంది.

గుత్తులుగా పూయాలి అంటే?

అయితే కనకాంబరాలు మంచి రంగుతో గుత్తులు గుత్తులుగా పూయాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవో చూద్దాం.

సింపుల్ చిట్కాలు

కనకాంబరాల మొక్కలకు ప్రతి వారానికి ఒకసారి ఆవు పేడ లేదా, వేపాకు పిండి వేయాలి. దీని వలన పూలు ఎక్కువగా పూస్తాయి.

ఆవు పేడ

అలాగే మొక్క చాలా వేపుగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో కత్తిరింపులు చేపట్టాలి. దీంతో కొమ్మలు ఎక్కువగా వచ్చి పూలు ఎక్కువగా పూస్తాయి.

కత్తిరింపులు

అంతే కాకుండా టీ పౌడర్ నీరు పోయడం వలన కూడా కనకాంబరాల పూలు చాలా బాగా, గుత్తులు గుత్తులుగా పూస్తాయి.

టీ పౌడర్

అలాగే కనకాంబరాల చెట్టు వద్ద వడ్ల గింజలు వేయాలి. అవి చెట్టు వేరు చుట్టూ మొలకగా వస్తాయి. దీని వలన మొక్క తేమగా ఉండి, పూలు బాగా పూస్తుంది.

వడ్లగింజలు