ఈ అలవాటు మీ ఆయుష్షును రెట్టింపు చేసే ఛూమంత్రం..!

03 April 2026

TV9 Telugu

TV9 Telugu

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మనలో చాలా మంది ఈ నియమం పాటించరు. దీని వల్ల ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటాం

TV9 Telugu

ముఖ్యంగా డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డే వారు గ్లూకోజ్ స్థాయిల‌ను స‌మ‌తుల్యంగా ఉంచ‌డానికి, ఇన్సులిన్ నిరోధ‌క‌త‌ను తగ్గించ‌డానికి నిత్యం హైడ్రేటెడ్‌గా ఉండలి. నీళ్లు తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ప్రభావితం అవుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

నీటిలో క్యాల‌రీలు, కార్బొహైడ్రేట్స్ వంటివి ఉండ‌వు. కానీ నీళ్లు తాగ‌డం వ‌ల్ల త‌గినంత హైడ్రేష‌న్ ఉండ‌డం వ‌ల్ల శ‌రీరం గ్లూకోజ్ ను మ‌రింత స‌మ‌ర్థవంతంగా ప్రాసెస్ చేసుకుంటుంది

TV9 Telugu

అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. నీళ్లు త‌క్కువ‌గా తాగ‌డం వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేష‌న్ కు గుర‌వుతుంది. దీంతో ర‌క్తంలో గ్లూకోజ్ సాంద్ర‌త ఎక్కువ‌గా క‌నిపిస్తుంది

TV9 Telugu

డీహైడ్రేష‌న్ కార‌ణంగా చ‌క్కెర స్థాయిలు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. జీవ‌క్రియ నియంత్రణ మరింత క‌ష్టంగా మారుతుంది. శ‌రీరం హైడ్రేటెడ్ గా ఉండ‌డం వల్ల గ్లూకోజ్ ప‌లుచ‌గా మారుతుంది

TV9 Telugu

మూత్రపిండాలు అద‌న‌పు చ‌క్కెర‌ల‌ను స‌జావుగా బ‌య‌ట‌కు పంపిస్తాయి. ఒత్తిడి హార్మోన్లు అదుపులో ఉండ‌డం వ‌ల్ల ఇన్సులిన్ నిరోధ‌క‌త కూడా త‌గ్గుతుంది

TV9 Telugu

నీళ్లు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించ‌న‌ప్పటికీ గ్లూకోజ్ స్థాయిల‌ను, ఇన్సులిన్ నిరోధ‌క‌త‌ను నీళ్లు ప్రభావితం చేస్తాయి. కాబట్టి దాహగా ఉన్నా లేకున్నా రోజూ సరిపడా నీళ్లు తప్పకుండా తాగాలి

TV9 Telugu

అలాగే డీహైడ్రేష‌న్ కు గురైన‌ప్పుడు ఆక‌లి ఎక్కువ‌గా అవ్వడం లేదా తీపి తినాల‌నిపించ‌డం వంటివి జ‌రుగుతాయి. దీనివల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. రోజంతా క్రమం త‌ప్పకుండా నీటిని తాగుతూ శ‌రీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచ‌డం వ‌ల్ల త‌ప్పుడు ఆక‌లి సంకేతాల‌ను త‌గ్గించ‌వ‌చ్చు