AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం పూట ఏ పండ్లు తినాలి.. ఏవి తినకూడదు..? ఇవి తప్పక తెలుసుకోండి..

ఉదయాన్నే పండ్లు తింటే ఆరోగ్యమని మనందరికీ తెలుసు.. కానీ ఏ పండు తింటున్నామన్నదే ముఖ్యం.. మీరు ఆరోగ్యంగా ఉండాలని తినే పండే మీ కడుపులో మంటకు, గ్యాస్ సమస్యలకు కారణం కావొచ్చు. పరగడుపున ఆపిల్ తింటే అమృతం.. అదే నారింజ తింటే ఆమ్లం.. అసలు ఉదయం పూట ఏ పండ్లు మీకు మేలు చేస్తాయి? వేటిని దూరం పెట్టాలి? అనేది తెలుసుకుందాం..

ఉదయం పూట ఏ పండ్లు తినాలి.. ఏవి తినకూడదు..? ఇవి తప్పక తెలుసుకోండి..
Best Fruits To Eat On An Empty Stomach
Krishna S
|

Updated on: Apr 03, 2026 | 8:56 PM

Share

ఉదయం నిద్రలేవగానే ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు అని పెద్దలు చెబుతుంటారు. ఇది నిజమే కానీ, అన్ని పండ్లు ఖాళీ కడుపుతో తింటే మేలు చేస్తాయని అనుకోవడం పొరపాటే. ఏ సమయంలో ఏ పండు తినాలి? ఉదయాన్నే శరీరానికి శక్తినిచ్చే పండ్లు ఏవి? ఖాళీ కడుపుతో తింటే అనారోగ్యం కలిగించే పండ్లు ఏవి? అనేదానిపై ఆరోగ్య నిపుణులు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఉదయం అల్పాహారంలో ఇవి మీకు అమృతం

పరగడుపున పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన తేమ, శక్తి అందుతాయి.

ఆపిల్ : ఇందులో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా మలవిసర్జన సాఫీగా అయ్యేలా చూస్తుంది.

బొప్పాయి: జీర్ణక్రియకు బొప్పాయిని మించిన పండు లేదు. ఇందులోని పాపైన్ ఎంజైమ్‌లు మలబద్ధకం సమస్యను తరిమికొడతాయి.

పుచ్చకాయ : వేసవిలో పరగడుపున పుచ్చకాయ తింటే శరీరంలోని ఎలక్ట్రోలైట్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఇందులోని లైకోపీన్ చర్మానికి, కళ్ళకు మెరుపును ఇస్తుంది.

దానిమ్మ : రక్తహీనతతో బాధపడేవారికి ఇది వరం. ఇందులోని ఇనుము రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.

ఖాళీ కడుపుతో వీటిని తింటే ప్రమాదం

కొన్ని పండ్లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, ఖాళీ కడుపుతో తింటే సమస్యలు తెచ్చిపెడతాయి.

సిట్రస్ పండ్లు: నారింజ, గ్రేప్‌ఫ్రూట్ వంటి పుల్లటి పండ్లలో ఆమ్లాలు ఎక్కువ. వీటిని ఉదయాన్నే తింటే కడుపులో మంట, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి.

అరటిపండు: అరటిపండులో పొటాషియం ఎక్కువ. ఖాళీ కడుపుతో దీన్ని తింటే రక్తంలో మెగ్నీషియం, పొటాషియం సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే దీన్ని ఓట్స్ లేదా వేరే ఆహారంతో కలిపి తీసుకోవాలి.

ద్రాక్ష: చాలా తీపిగా ఉండే ద్రాక్షపండ్లను ఉదయాన్నే తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత వెంటనే పడిపోతాయి. దీనివల్ల మీరు త్వరగా అలసిపోతారు.

బేరి పండ్లు: వీటిలోని గట్టి పీచు పదార్థాలు ఖాళీ కడుపులోని సున్నితమైన పొరను చికాకు పెడతాయి.

పండ్లు తినేటప్పుడు ఈ సూత్రాలు పాటించండి..

నీరు తాగకండి: పండ్లు తిన్న 30 నిమిషాల ముందు లేదా తర్వాత నీళ్లు తాగవద్దు. అలా చేస్తేనే పోషకాలు శరీరానికి అందుతాయి.

ఉడికించవద్దు: పండ్లను ఉడికించడం వల్ల వాటిలోని విటమిన్-సి నశిస్తుంది.

బాగా నమలండి: పండ్లను బాగా నమలడం వల్ల లాలాజలం కలిసి జీర్ణక్రియ సులభమవుతుంది.

జ్యూస్ కంటే పండు మిన్న: ప్యాకెట్లలో దొరికే జ్యూస్‌ల కంటే తాజా పండ్లను అలాగే తినడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ అందుతుంది.

Follow Us
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
పెళ్లి తప్పనిసరా? గరుడ పురాణం షాకింగ్ సమాధానం!
పెళ్లి తప్పనిసరా? గరుడ పురాణం షాకింగ్ సమాధానం!
మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!
మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!
చంపకుండా మీ కిచెన్‌లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా?
చంపకుండా మీ కిచెన్‌లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా?
టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..
టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..
మీ ఫోన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలా.. వారానికి ఒక్క నిమిషం ఇలా..
మీ ఫోన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలా.. వారానికి ఒక్క నిమిషం ఇలా..
వేసవిలో వేధించే వేడి దద్దుర్లు.. ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న అ
వేసవిలో వేధించే వేడి దద్దుర్లు.. ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న అ
ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు
ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు