AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Financial Horoscope: ఈ రాశుల వారికి బడ్జెట్ తర్వాత ఆర్థికంగా దశ తిరిగినట్టే..!

Budget 2025 Astrology: కొత్త సంవత్సరంలో, అందులోనూ కొత్త ఆర్థిక సంవత్సరంలో కొన్ని గ్రహాల మార్పు వల్ల, కొన్ని అనుకూల నక్షత్రాల్లోకి శుభ గ్రహాలు ప్రవేశించడం వల్ల, కొన్ని రాశులకు కొత్త జీవితాలు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో కొత్త బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ, ఏయే రాశులకు అనుకూలతలు పెరగబోతున్నదీ, ఏయే రాశుల వారికి కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోయేదీ ఇక్కడ పరిశీలిద్దాం. ఈ ఏడాది వాణిజ్య, వ్యాపార రంగాల్లో స్థిరత్వం, ఆర్థికాభివృద్ధికి కొత్త బడ్జెట్ లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటికీ శని, గురువులు కారకులు. అంతేకాక, ఈ రెండు గ్రహాలు వ్యాపారాలు, టెక్నాలజీ, ప్రాథమిక సదుపాయాల రంగాలను అభివృద్ధి చేసే అవకాశం కూడా ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 23, 2025 | 5:00 PM

Share
మేషం: కొత్త ఆర్థిక సంవత్సరంలో మేష రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి కాస్తంత అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి పట్టు జారిపోకుండా ఉండడానికి ఈ రాశివారు గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. షేర్లు కొన్నా, ఇతరత్రా పెట్టుబడులు పెట్టినా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం మంచిది. లాభ స్థానంలో పాప గ్రహాల సంచారం వల్ల ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈ ఏడాది లాభాలు అందుతాయి. మే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలలు ఆదాయపరంగా బాగా అనుకూలంగా ఉంటాయి.

1 / 12
వృషభం: ఈ రాశివారికి ఈ ఏడాది ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడులు పెట్టినా అత్యధిక లాభాలను అందుకుంటారు. అయితే, ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. ఆదాయ వ్యయాలను సమతూకంతో నిర్వహించడం మంచిది. ఏది ఏమైనా వృషభ రాశివారి ఆర్థిక పరిస్థితి ఈ ఏడాది గణనీయంగా మెరుగుపడుతుంది. గురువు ధన స్థానంలోకి, శని లాభ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. కుజ సంచారం బాగా అనుకూ లంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి, వారసత్వ సంపదకు బాగా అవకాశం ఉంది.

2 / 12
మిథునం: కొత్త ఆర్థిక సంవత్సరాల్లో మిథున రాశివారు ఆర్థిక వ్యవహారాల్లోనూ, ఆర్థిక లావాదేవీల్లోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉన్నట్టే, ఆకస్మిక ధన నష్టానికి కూడా అవకాశం ఉంది. భారీగా పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం అవసరం. గురువు అనుకూలత వల్ల ఆదాయం ఎక్కువగానూ ఖర్చు తక్కువగానూ ఉంటుంది. షేర్లు, కమీషన్లు, వడ్డీలు, లాటరీల వల్ల అదనపు ఆదాయానికి బాగా అవకాశం ఉంది. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది.

3 / 12
కర్కాటకం: కొత్త ఆర్థిక సంవత్సరమంతా ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఒకపక్క ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశమున్నప్పటికీ మరోపక్క ఖర్చులు పెరగడం ప్రారంభమవుతుంది. మీకు ఆర్థికంగా భద్రత ఉండాలన్న పక్షంలో దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలే ఉత్తమం. ఏడాది మొదట్లో ఆదాయం సామాన్య స్థాయిలో ఉన్నా మున్ముందు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి ప్రస్తుతం సమయం బాగా అనుకూలంగా ఉంది. గురువు అనుకూలత వల్ల ఆదాయానికి మాత్రం లోటుండదు. ఏప్రిల్ నుంచి ఆదాయ వృద్ది మొదలవుతుంది.

4 / 12
సింహం: ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ వృద్ధికి సంబంధించినంత వరకూ ఈ ఏడాది ఈ రాశివారికి సానుకూ లంగానే గడిచిపోతుంది. ఇదివరకు పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు అందడం జరుగు తుంది. గత ఏడాది ఆర్థిక సమస్యల వల్ల పూర్తి కాని పనులు ఈ ఏడాది తప్పకుండా పూర్తవు తాయి. తప్పకుండా సొంత ఇల్లు అమరవుతుంది. షేర్లు, భూముల మీద పెట్టే పెట్టుబడుల వల్ల అంచనాలకు మించి లాభాలు కలుగుతాయి. తప్పకుండా వాహన యోగం కలుగుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభం పొందుతారు. పొదుపులకు, మదుపులకు ఎక్కువగా అవకాశం ఉంది.

5 / 12
కన్య: ఈ ఏడాది కన్యా రాశివారికి తప్పకుండా ఆదాయం పెరుగుతుంది. వ్యాపార, వ్యక్తిగత కారణాల వల్ల మొదట్లో కొద్దిగా ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పెట్టుబడుల వల్ల లాభం ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల్ని మాత్రం తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక సంబంధమైన నిర్ణయాలలో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఆర్థిక భద్రతకు దోహదం చేసే అనేక ఆదాయావకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి.

6 / 12
తుల: ఈ రాశికి కొత్త ఆర్థిక సంవత్సర ఫలితాలు కొద్దిగా మిశ్రమంగానే ఉన్నాయి. ఆర్థిక వ్యవహారా ల్లోనూ, పెట్టుబడులు పెట్టడంలోనూ అనుభవజ్ఞులు, నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల వ్యక్తిగత బడ్జెట్ మీద ఒక కన్ను వేసి ఉండడం అవసరం. రియల్ ఎస్టేట్ లోనూ, భూముల కొనుగోలులోనూ పెట్టుబడులు పెట్టడం వల్ల అత్యధికంగా లాభాలు పొందుతారు. స్టాక్ మార్కెట్, బంగారం, లాటరీల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా లాభాలు గడిస్తారు. ఆర్థిక వ్యవహారాలు దిగ్విజయంగా సాగుతాయి.

7 / 12
వృశ్చికం: ఈ రాశివారికి ఈ ఏడాది అన్నివిధాలా స్థిరత్వాన్ని ఇస్తుంది. ఆదాయ వృద్ధికి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. అయితే, అవి నిదానంగా ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపాటుతనంతో వ్యవహరించకపోవడం మంచిది. ఈ ఏడాదంతా ఆదాయానికి లోటుండదు.  ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నందువల్ల పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీ కోరికలు తీరుతాయి. అక్టోబర్ లో మాత్రం జాగ్రత్తగా ఉండ డం మంచిది. స్థలాలు, షేర్లు, రియల్ ఎస్టేట్ మీద పెట్టే పెట్టుబడులు అత్యధిక లాభాలనిస్తాయి.

8 / 12
ధనుస్సు: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో సైతం ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొద్దిగా అనుకోని ఖర్చులుండే అవకాశం ఉంది. ఆదాయం పెరగడానికి అనేక అవకాశాలు అందివస్తాయి. వాటిని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు చాలావరకు తగ్గిపోతాయి. కొత్త సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవడం మంచిది. ఖర్చులు తగ్గించుకుని పొదుపును పెంచడం శ్రేయస్కరం.

9 / 12
మకరం: ఈ రాశివారికి కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయం బాగా పెరిగి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. మీ శ్రమకు, ప్రతిభకు, కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. షేర్లు, వడ్డీలు, లాటరీలు తదితర ఆర్థిక లావా దేవీల్లోనే కాక, భూములు, బంగారం మీద కూడా పెట్టుబడులు పెంచడం వల్ల అంచనాలకు మించిన లాభాలు కలిగే అవకాశం ఉంది. జూన్, జూలై నెలల్లో వృథా ఖర్చులు పెరిగే సూచ నలు న్నాయి. కుజుడి అనుకూలత వల్ల భూ లాభాలు కలుగుతాయి. వారసత్వ సంపద లభిస్తుంది. శని, గురువుల కారణంగా పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు.

10 / 12
కుంభం: ఆదాయానికి సంబంధించినంత వరకూ ఈ రాశివారికి అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఏడాదంతా ఆదాయానికి లోటుండకపోవచ్చు. రవి, కుజులు బాగా అనుకూలంగా ఉండ డం, లాభ స్థానం మీద శుభ గ్రహాల దృష్టి పడడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందు తుంది. పెట్టుబడులకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల బాగా లాభం పొందుతారు. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవు తాయి. భూములు, షేర్లు, బంగారం, రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది.

11 / 12
మీనం: ఈ రాశివారికి అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది కానీ, శుభకార్యాల మీదా, కుటుంబం మీదా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, భూముల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల బాగా లాభముంటుంది. రిస్కు తీసుకోవడం కన్నా ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ వల్ల అనేక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. దేనిలోనూ భారీగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయవద్దు. శని ప్రతికూలత కారణంగా భారీ పెట్టుబడుల్లో కొద్దిగా నిదానంగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది.

12 / 12