బడ్జెట్ తర్వాత అత్యంత చౌకగా మారిన  వస్తువులు ఇవే!

బడ్జెట్ తర్వాత అత్యంత చౌకగా మారిన  వస్తువులు ఇవే!

image

TV9 Telugu

01 February 2025

లిథియం-అయాన్ బ్యాటరీల తయారీలో ఉపయోగించే మూలధన వస్తువులపై కస్టమ్ డ్యూటీని సున్నాకి తగ్గించారు. ఇది మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గిస్తుంది.

లిథియం-అయాన్ బ్యాటరీల తయారీలో ఉపయోగించే మూలధన వస్తువులపై కస్టమ్ డ్యూటీని సున్నాకి తగ్గించారు. ఇది మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గిస్తుంది.

వైద్య పరికరాలు, ప్రాణాలను రక్షించే మందులు, క్యాన్సర్ మందులు సున్నా ప్రాథమిక కస్టమ్ డ్యూటీ జాబితాలో చేర్చారు. ఇకపై మెడిసిన్స్ ధరలు భారీగా తగ్గనున్నాయి.

వైద్య పరికరాలు, ప్రాణాలను రక్షించే మందులు, క్యాన్సర్ మందులు సున్నా ప్రాథమిక కస్టమ్ డ్యూటీ జాబితాలో చేర్చారు. ఇకపై మెడిసిన్స్ ధరలు భారీగా తగ్గనున్నాయి.

దిగుమతి చేసుకునే మోటార్‌సైకిళ్ల వివిధ వర్గాలపై ప్రాథమిక కస్టమ్ సుంకం 5 శాతం నుండి 20 శాతానికి తగ్గించారు. దీంతో ఈ ఖరీదైన వాహనాలు కూడా చౌకగా మారతాయి.

దిగుమతి చేసుకునే మోటార్‌సైకిళ్ల వివిధ వర్గాలపై ప్రాథమిక కస్టమ్ సుంకం 5 శాతం నుండి 20 శాతానికి తగ్గించారు. దీంతో ఈ ఖరీదైన వాహనాలు కూడా చౌకగా మారతాయి.

దేశీయ వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి, చిన్న, మధ్యస్థ మగ్గాలపై దిగుమతి ఛార్జీలు 7.5 శాతం నుండి సున్నాకి తగ్గించారు. దీంతో బట్టల ధరలు చౌకగా మారనున్నాయి.

వెట్ బ్లూ లెదర్, క్రస్ట్ లెదర్‌పై దిగుమతి సుంకం సున్నాకి తగ్గించారు. వాటి నుండి తయారైన ఉత్పత్తులను చౌకగా చేస్తుంది.

LCD/LED టీవీల ఓపెన్ సెల్ తయారీ కోసం మూలధన వస్తువుల దిగుమతిపై సుంకం 2.5 శాతం నుండి సున్నాకి తగ్గించారు.

స్తంభింపచేసిన చేపల పేస్ట్ (సురిమి)పై కస్టమ్ డ్యూటీ బడ్జెట్ 2025లో 30 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది.

రెడీమేడ్ గార్మెంట్స్ దిగుమతిపై సుంకాన్ని 20 శాతం లేదా కిలోకు రూ.115 (ఏది ఎక్కువైతే అది) పెంచడం వల్ల బట్టల ధర మరింత పెరుగుతాయి.

ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలపై కస్టమ్ డ్యూటీని 10 శాతం నుండి 20 శాతానికి పెంచారు. వాటి ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.