ఏళ్ల నాటి నలంద విశ్వవిద్యాలయం గురించి కొన్ని విశేషాలు..
TV9 Telugu
31 January 2025
నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1600 ఏళ్ల నాటి ఈ వారసత్వపు కొత్త రూపాన్ని చూడటానికి అందరూ ఉత్సుకతతో ఉన్నారు.
నలంద విశ్వవిద్యాలయం 450 ADలో గుప్త చక్రవర్తి కుమార్ గుప్త-I చే స్థాపించడం జరిగింది. ఆ తరువాత హర్షవర్ధన్, పాల పాలకులు ప్రోత్సాహాన్ని అందించారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పురాతన బౌద్ధ విశ్వవిద్యాలయం శిధిలాలు ఇప్పటికీ బీహార్ పాట్నాకి 90 కిలోమీటర్ల దూరంలో షరీఫ్‌నకు12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
ఈ విశ్వవిద్యాలయం తక్షశిల తర్వాత ప్రపంచంలో రెండవ పురాతన విశ్వవిద్యాలయంగా పరిగణిస్తారు. ప్రపంచంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం.
అప్పట్లోనే ఈ యూనివర్సిటీకి ప్రపంచం నలుమూలల నుండి విద్యార్ధులు ఇక్కడ విద్యను అభ్యసించడానికి వచ్చేవారు.
ఇది 300 కంటే ఎక్కువ గదులు, ఏడు పెద్ద హాళ్లు, లైబ్రరీ తొమ్మిది అంతస్తులుగా ఉండేది. దీని పేరు ధరమ్‌గంజ్‌గా పిలిచేవారు.
నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ నిర్మాణం 2017లో ప్రారంభమైంది. కొత్త క్యాంపస్‌లో రెండు అకడమిక్ బ్లాక్‌లు ఉన్నాయి.
వీటిలో 40 తరగతి గదులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 1900 మంది పిల్లలకు సీటింగ్ ఏర్పాటు చేశారు. యూనివర్సిటీలో రెండు ఆడిటోరియంలు కూడా ఉన్నాయి.
అంతర్జాతీయ ఆడిటోరియం, యాంఫీ థియేటర్ కూడా నిర్మించారు. 2 వేల మంది కూర్చునే సామర్థ్యం ఉంది. విద్యార్థుల కోసం ఫ్యాకల్టీ క్లబ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి.
కొత్త క్యాంపస్‌లో, బౌద్ధ అధ్యయనాలు, తత్వశాస్త్రం, తులనాత్మక మతం, చరిత్ర, జీవావరణ శాస్త్రం, పర్యావరణ అధ్యయనాలు, నిర్వహణ కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు.