AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: ఆమె స్టోరీపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. 700 మంది పురుషులకు సారధిగా మహిళ..

Anand Mahindra: టాలెంట్ ఎక్కడ ఉన్నా దానిని ప్రశంశించటంలో ముందుండే ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా.. మరో సారి మహిళల స్వశక్తి గురించి ఆలోచింపజేసే విధంగా ఉన్న ఒక స్టోరీపై స్పందించారు.

Anand Mahindra: ఆమె స్టోరీపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. 700 మంది పురుషులకు సారధిగా మహిళ..
Anand Mahindra
Ayyappa Mamidi
|

Updated on: May 03, 2022 | 3:44 PM

Share

Anand Mahindra: టాలెంట్ ఎక్కడ ఉన్నా దానిని ప్రశంశించటంలో ముందుండే ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా.. మరో సారి మహిళల స్వశక్తి గురించి ఆలోచింపజేసే విధంగా ఉన్న ఒక స్టోరీపై స్పందించారు. మహిళలు పురుషులకు(Gender diversity) ఏమాత్రం తక్కువ కాదని చెప్పేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రస్తుతం ఆధునిక యుగంలో ఆడవారు అన్ని రంగాల్లో మగవారితో పోటీ పడుతున్నారు. కానీ.. ఇప్పటికీ వారిని వంటింటి కుందేళ్లంటూ చులకన చేసి తక్కువగా చూస్తూనే ఉన్న రోజులివి. కృషితో జీవితంలో ఉన్నత స్థాయిలకు చేరుకోవాలనే విషయంలో మగాళ్లకు మేము ఏమాత్రం తక్కువ కాదని నిరూపించిన ఓ మహిళ గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర(Mahindra Tweet) తన ట్విట్టర్‌లో ప్రశంశించారు. స్వశక్తితో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆడ, మగ అనే తేడా ఏమాత్రం అడ్డుకాదని రుజువు చేసిన సదరు మహిళా ఉద్యోగి గురించి ఆయన ప్రశంశించటం ఇప్పుడు అందరినీ ఒక్క సారిగా ఆలోచింపజేస్తోంది. తాజాగా.. ఆయన ట్విట్టర్‌లో మండే మోటివేషన్ హ్యాష్‌ట్యాగ్‌తో (#MondayMotivation) మహీంద్రా సంస్థ చీఫ్ కస్టమర్, బ్రాండ్ ఆఫీసర్ ఆషా ఖర్గా పోస్ట్ చేసిన వీడియోను మహీంద్రా ట్యాగ్ చేశారు.

అసలు విషయం ఏమిటంటే.. మహీంద్రా సంస్థలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని గురించి ఆషా ఖర్గా తన ట్వీట్‌లో వివరించారు. ఆ ఉద్యోగిని పేరు అనుష్క పాటిల్. మహీంద్ర XUV700 ప్రాసెసింగ్ యూనిట్‌లో టీమ్ లీడ్‌గా విధులు నిర్వర్తిస్తోంది. 700 మందికి పైగా పురుష ఉద్యోగులను అనుష్క లీడ్‌ చేస్తోంది. 12 ఏళ్ల క్రితం మహీంద్ర నాసిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌లో ఉద్యోగంలో చేరిన అనుష్క పాటిల్.. నిబద్దతతో పనిచేస్తూ.. అంచెలంచెలుగా కంపెనీలో ఉన్నత స్థాయికి చేరుకుంది. ఇంత మంది పురుషులను ఏకతాటిపైకి తెచ్చి పనిని ముందుకుతీసుకెళ్లటం అంత తేలిక విషయం కాదు. అనుష్క పాటిల్ జీవితంలో ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. #SheIsOnTheRise హ్యాష్‌ట్యాగ్‌తో అనుష్క పాటిల్ స్టోరీని Rise Storyగా మహీంద్ర చీఫ్ కస్టమర్ అండ్ బ్రాండ్ ఆఫీసర్‌ ఆషా ఖర్గా పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌ను ఆనంద్ మహీంద్ర ట్యాగ్ చేశారు. అందరూ కోరుకుంటున్న జెండర్ డైవర్సిటీ సాధించడానికి ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని మహీంద్రా అన్నారు. ఇందుకోసం వేగంగా అడుగులేయకపోతే ఇలాంటి టాలెంట్‌ ఉన్నవారిని కోల్పోతామని ఆనంద్ మహీంద్ర అనుష్కను ట్వీట్ లో కొనియాడారు. 700 మంది ఉద్యోగులను ముందుండి నడిపిస్తున్న అనుష్క ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఇవీ చదవండి..

Hyderabad: కంపెనీలకు తెలంగాణ అడ్డాగా మారుతోందన్న మంత్రి కేటీఆర్.. రానున్న కాలంలో లక్షల్లో కొలువులు..

Parag Agarwal: ట్విట్టర్ లో మార్పులు.. భారత సంతతి సీఈవోను తొలగించనున్న ఎలాన్ మస్క్.. ఎందుకంటే..