AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO: రేపు ప్రారంభమౌతున్న అతిపెద్ద ఐపీవో.. ఎల్ఐసీ గురించి తెలుసుకోవలసిన టాప్-10 విషయాలివే..

LIC IPO: అందరూ ఎన్నాళ్లనుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐపీవో దగ్గర పడింది. మే 4న ప్రారంభమయ్యే ఈ ఐపీవో మే 9న ముగియనుంది.

LIC IPO: రేపు ప్రారంభమౌతున్న అతిపెద్ద ఐపీవో.. ఎల్ఐసీ గురించి తెలుసుకోవలసిన టాప్-10 విషయాలివే..
Lic Ipo
Ayyappa Mamidi
|

Updated on: May 03, 2022 | 5:02 PM

Share

LIC IPO: అందరూ ఎన్నాళ్లనుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐపీవో దగ్గర పడింది. మే 4న ప్రారంభమయ్యే ఈ ఐపీవో మే 9న ముగియనుంది. LIC మే 4న దేశంలోనే అతిపెద్ద IPOగా మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉండగా.. కేంద్రం LIC IPO ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేర్‌కి రూ. 902 నుంచి రూ. 949గా నిర్ణయించింది. IPO విలువ రూ. 21,000 కోట్లుగా ఉంది. మే 2న యాంకర్ పోర్షన్ సేల్ కు అందుబాటులోకి వచ్చింది. దీనికి 7 వేల కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ తో పాటు ఇతర పార్టిసిపెంట్లకోసం మే 4 నుంచి మే 9 వరకు ఐపీవో అందుబాటులో ఉంటుంది. IPOలో ‘పాలసీ హోల్డర్స్ ‘ కోటా ఉండటం ఇదే మొదటిసారి. ఇది ఇప్పటి వరకు దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా(Public Issue) మారింది. ఎల్‌ఐసీ ఐపీవోపై ఒకపక్క ఉత్కంఠ పెరగడంతో.. ఇందులో ఇన్వెస్ట్ చేసే ముందు పాలసీదారులు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇన్వెస్టర్లు తెలుసుకోవలసిన టాప్-10 విషయాలివే..

1. LIC IPO మొత్తం విలువ రూ. 21,000 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పటి వరకు దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ ఇదే.

2. ఉద్యోగుల కోసం సుమారు 15.81 లక్షల షేర్లు అందుబాటులోకి. పాలసీదారుల కోసం ఎల్ఐసీ సంస్థ దాదాపు 2.21 కోట్ల షేర్లను ఇప్పటికే రిజర్వ్ చేసింది.

3. ఐపీవో పార్టిసిపెంట్స్ షేర్లను లాట్లలో కొనాల్సి ఉంటుంది. LIC IPO ఒక్కో లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు కనీసం ఒక లాట్ నుంచి గరిష్ఠంగా 14 లాట్ల వరకు అప్లై చేయవచ్చు. ఒక్కో లాట్ కొనేందుకు కనీసం రూ. 14,235 అవసరం.

4. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం.. LIC IPO గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) నిన్న రూ. 69గా ఉండగా.. ఈ రోజు రూ. 85కు చేరింది.

5. పబ్లిక్ ఇష్యూ కోసం అప్లై చేసుకునే పాలసీదారులకు రూ. 60 తగ్గింపు.. ఎల్‌ఐసి ఉద్యోగులకు రూ. 45 తగ్గింపును ప్రభుత్వం అందిస్తోంది.

6. LIC పాలసీ హోల్డర్స్ రిజర్వేషన్ పోర్షన్ ఆఫర్ సైజులో 10 శాతంగా ఉంది. అయితే ఉద్యోగులకు పోస్ట్ ఆఫర్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 5 శాతం రిజర్వ్ చేయబడతారు.

7. IPOను గతంలో మార్చి 31 లోపు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు అంతర్జాతీయ పరిణామాలు దారుణంగా మారటంతో మార్కెట్లు భారీగా ప్రభావితం అయ్యాయి. ఈ కారణంగా ఐపీవో ఆఫర్ వాయిదా పడింది.

8. LIC IPO యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 13,000 కోట్ల విలువైన కమిట్ మెంట్ వచ్చాయి. ఈ మెుత్తం యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఎల్ఐసీ కేటాయింటిన షేర్ల విలువకంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంది.

9. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్‌ఐసీ బంపర్ ఐపీవో ముగిసిన వారం తర్వాత మే 17న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

10. గతంలో ముందుగా కేంద్ర ప్ర‌భుత్వం ఎల్ఐసీలో 5 శాతం వాటాను విక్రయిస్తామని మొదట డ్రాఫ్ట్ పేపర్స్‌లో వెల్లడించింది. అయితే.. ప్ర‌స్తుతం వివ‌రాల ప్ర‌కారం ఎల్ఐసీ IPO పరిమాణాన్ని 1.5 శాతం మేర తగ్గించింది. ఎల్‌ఐసీ బోర్డు మార్కెట్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఇష్యూ పరిమాణాన్ని 3.5 శాతానికి పరిమితం చేసింది. కేవలం 3.5 శాతం వాటాలను అమ్మటం ద్వారా రూ.21,000 కోట్లను సమీకరించాలని కేంద్రం నిర్ణయించింది.

ఇవీ చదవండి..

Ration Card Rules: రేషన్ కార్డులకు కొత్త రూల్స్ ఇవే.. వారు కార్డ్ సరెండర్ చేయకపోతే చర్యలు తప్పవు..

Anand Mahindra: ఆమె స్టోరీపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. 700 మంది పురుషులకు సారధిగా మహిళ..