AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏఐతో మానవాళికి తప్పని ముప్పు.. గూగుల్‌ వార్నింగ్‌ వీడియో

ఏఐతో మానవాళికి తప్పని ముప్పు.. గూగుల్‌ వార్నింగ్‌ వీడియో

Samatha J

|

Updated on: Apr 10, 2025 | 7:15 PM

AI తో మానవాళికి ముప్పు తప్పదా అంటే.. అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. ఏఐ టెక్నాలజీ రోజురోజుకీ అడ్వాన్స్‌ అవుతున్న నేపథ్యంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం మానవాళి మనుగడకే ప్రమాదంగా మారుతుందనే ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ ఆందోళన తొందర్లోనే నిజం కాబోతోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. గూగుల్ డీప్ మైండ్ తన పరిశోధనా పత్రంలో ఈ వివరాలు వెల్లడించింది. 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చెందుతుందని, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ AGI గా రూపాంతరం చెందుతుందని తెలిపింది.

ఈ వెర్షన్ మనుషులను మించిపోతుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ పరిమితులను అధిగమిస్తుందని తెలిపింది. ఏఐకి మానవ తెలివితేటలు రావడంతో పాటు మానవులతో సమానంగా పనిచేయగల ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. ఈ పరిణామంతో మానవాళి అస్తిత్వం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు డీప్ మైండ్ సీఈవో, కో ఫౌండర్ షేన్ లెగ్ స్పందిస్తూ… మానవాళికి ఏజీఐ తీవ్ర హాని తలపెట్టే ప్రమాదం ఉందని తాము అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయితే, ఈ ముప్పు ఎలాంటిది, మానవాళి మనుగడకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందనే వివరాలను ఆయన వెల్లడించలేదు. తమ పరిశోధన ఏఐని నియంత్రణలో ఉంచడంపైనే కేంద్రీకరించామని, దానివల్ల ఎదురయ్యే ముప్పును తప్పించే ప్రయత్నాలపై లోతుగా అధ్యయనం చేశామని వివరించారు. ఏఐని దుర్వినియోగం చేస్తూ ఇతరులకు హాని కలిగించేందుకు ఉపయోగించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డీప్ మైండ్ పరిశోధనా పత్రంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మిస్ యూజ్, మిస్ అలైన్ మెంట్, మిస్టేక్స్, స్ట్రక్చరల్ రిస్క్ వంటి అంశాలతో ఏజీఐతో నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నష్టాలను తప్పించేందుకు డెవలపర్లు భద్రతా ప్రోటోకాల్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. మనుషులకు ముప్పు కలిగించే పనులకు సంబంధించి ఏజీఐ సామర్థ్యాన్ని పరిమితం చేయాలని వెల్లడించింది.

మరిన్ని వీడియోల కోసం 

గిన్నిస్‌ రికార్డులకెక్కిన ఎలుక..ఎందుకో తెలిస్తే షాకవుతారు వీడియో

శ్రీశైలంలో 2 చిరుతల సంచారం.. ఆ గేటు కాని లేకపోతే వీడియో

అయ్యో.. ఈ కండక్టర్‌ కష్టాలు ఎవరికీ రాకూడదు..వీడియో

క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయిన విద్యార్థి.. ఏం జరిగిందంటే వీడియో