ఓఆర్ఎస్ ద్రావణం ఎలక్ట్రోలైట్ నష్టాన్ని భర్తీ చేయడానికి అవసరం. అయితే, శరీరానికి అవసరమైనంత వరకే తీసుకోవాలి. మందుల మాదిరిగానే, ఓఆర్ఎస్ అతిగా తీసుకోవడం ప్రమాదకరం. ఇది ప్రమాదకరమైన ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరం వంటి సమయాల్లో మాత్రమే దీని వినియోగం సిఫార్సు చేయబడింది.