కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
2026 ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ఉద్యోగులకు అద్భుత అవకాశం కల్పిస్తోంది. పండుగలు శని-ఆదివారాలకు దగ్గరగా రావడంతో, ఒక రోజు సెలవు తీసుకుంటే 3-4 రోజుల లాంగ్ వీకెండ్స్ లభిస్తాయి. ఇది కుటుంబంతో గడపడానికి, స్వగ్రామ సందర్శనలకు, మానసిక ఉత్సాహానికి దోహదపడుతుంది. సంక్రాంతి, ఉగాది, మే డే వంటి సెలవులతో దీర్ఘకాల విశ్రాంతి పొందవచ్చు.
2026 సంవత్సరానికి విడుదలైన ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ఉద్యోగులకు నిజంగా శుభవార్తగా మారింది. శని–ఆదివారాలకు దగ్గరగా పండుగ సెలవులు రావడంతో, ముందస్తుగా ఒక్కరోజు లీవ్ ప్లాన్ చేసుకుంటే మూడు నుంచి నాలుగు రోజుల వరుస విశ్రాంతి పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఉద్యోగుల మానసిక ఉత్సాహాన్ని పెంచి, పనితీరును మెరుగుపరుస్తుందన్న అభిప్రాయం ఉంది. కుటుంబంతో సమయం గడపడం, స్వగ్రామాల సందర్శన, వ్యక్తిగత అవసరాల కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జనవరి 14,15,16న భోగి, మకర సంక్రాంతి, కనుమ వరుసగా మూడ్రోజులు ప్రభుత్వ సెలవులు. తర్వాత శని, ఆదివారం కలిపి కొంతమంది ఐదు రోజుల వరకు సెలవు తీసుకునే అవకాశమూ ఉంది. జనవరి 26న సోమవారం రావడం వల్ల ముందుగా శని, ఆదివారాలతో కలిపి మూడు రోజుల వరుస సెలవులు సహజంగానే రానున్నాయి. మార్చ్‌లో.. ఉగాది గురువారం మార్చి 19న, ఈద్ శుక్రవారం మార్చి 20న రావడం వల్ల శనివారం మార్చి 21 కలిపి మూడు రోజులు వరుస సెలవులు రానున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో సహజంగా మూడు రోజుల లాంగ్ వీకెండ్లు ఏర్పడుతున్నాయి. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే శుక్రవారం రావడం వల్ల వెంటనే శని–ఆదివారాలతో కలిపి మూడు రోజుల సెలవులు వస్తాయి. అలాగే మే 1న మే డే శుక్రవారం రావడం వల్ల మే 2, 3 తేదీల్లో శని, ఆదివారాలు కలిసి మరో మూడు రోజుల వరుస సెలవులు ఏర్పడతాయి. ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జాతీయ పండుగలు లాంగ్ వీకెండ్‌కు దారి తీస్తున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న శనివారం రావడం వల్ల 15, 16 తేదీల్లో శని–ఆదివారాలు ఉంటాయి. అదే విధంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి శుక్రవారం రావడం వల్ల అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో వరుసగా మూడు రోజుల సెలవులు సహజంగానే రానున్నాయి. నవంబర్‌లో దీపావళి ఉద్యోగులకు అనుకూలంగా ఉండనుంది. దీపావళి నవంబర్ 8 ఆదివారం రావడంతో ముందు రోజు శనివారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉంటుంది. మొత్తంగా చూస్తే, 2026లో సెలవుల క్యాలెండర్ ఉద్యోగులకు అనుకూలంగా ఉండటంతో, ముందస్తు ప్రణాళికతో ఒక రోజు లీవ్ తీసుకున్నా మూడు నుంచి నాలుగు రోజుల వరుస సెలవులు పొందే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రిస్మస్ సెలవులకి బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ
నో వెయిటింగ్.. నో పుషింగ్.. శ్రీవారి సన్నిధిలో కొత్త టెక్నాలజీ సూపర్ సక్సెస్
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ
ఓరి మీ ఏషాలో.. న్యూ ఇయర్ వేళ మందుబాబుల హంగామా
3 రోజుల్లో.. రూ.1000 కోట్ల మద్యం తాగేశారు
న్యూ ఇయర్ విషెష్‌తో ఆకట్టుకుంటున్న కడియం నర్సరీ
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్

