కొత్త ఏడాది వేళ.. స్విట్జర్లాండ్ బార్‌లో బాంబ్ బ్లాస్ట్ !!
ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ స్విట్జర్లాండ్‌లోని క్రాన్స్ మోంటానా స్కీ రిసార్ట్‌లోని బార్‌లో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. స్విస్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన క్రాన్స్ మోంటానాలో జరిగిన ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ స్విట్జర్లాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. లగ్జరీ ఆల్పైన్ స్కీ రిసార్ట్ పట్టణం క్రాన్స్ మోంటానా లోని ఒక బార్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారని స్విస్ పోలీసులు తెలిపినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లే కాన్ట్సెలేషన్ అనే బార్‌లో గురువారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్నదానిపై క్లారిటీ లేదు. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్విస్ ఆల్ప్స్ పర్వతశ్రేణుల నడుమ ఉన్న ఈ క్రాన్స్ మోంటానా నగరం ప్రముఖ పర్యాటక స్థలం. ఏటా డిసెంబరు-జనవరి సమయంలో ఇక్కడ పర్యాటకుల తాకిడి విపరీతంగా ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?
Teja Sajja: నేను విన్నాను.. నేనున్నాను అంటున్న హీరో
Nayanthara: నయనతారకు మాత్రమే అదెలా సాధ్యం..?
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.

