కమ్ బ్యాక్ ఇవ్వాలమ్మా.. లేకపోతే చాలా కష్టం
టాలీవుడ్‌లో స్టార్ డమ్ ఉన్నా హిట్టు లేకపోతే ఎవరూ పట్టించుకోరు. గతం గొప్పగా ఉన్నా, ప్రస్తుతం విజయం సాధించడం ముఖ్యం. శ్రీలీల, సమంత, పూజా హెగ్డే, కీర్తి సురేష్ వంటి పలువురు హీరోయిన్లు ప్రస్తుతం ఒక భారీ కమ్‌బ్యాక్ హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. రాబోయే చిత్రాలపైనే వారి ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ కొత్త ఏడాదిలోనైనా వారి కమ్ బ్యాక్ సాధ్యమవుతుందా చూడాలి.
స్టార్ డమ్ ఎంతున్నా.. హిట్టు లేకపోతే ఎవరూ పట్టించుకోరు ఇండస్ట్రీలో. మా గతం ఘనం అని చాటుకున్నా పట్టించుకోరిక్కడ.. ప్రస్తుతం ఏంటనేది కావాలందరికీ..! ప్రస్తుతం అలాంటి కమ్ బ్యాక్ కోసమే కొందరు హీరోయిన్లు వేచి చూస్తున్నారు. అప్పట్లో హిట్లున్నాయ్ కాదు.. ఇప్పుడు హిట్లు కొడతామని నిరూపించుకునేందుకు బ్యాగ్ వేసుకుని బయల్దేరారు కొందరు హీరోయిన్లు. మరి వాళ్లెవరో తెలుసా..? వరసగా సినిమాలైతే చేస్తున్నారు కానీ ఎందుకు చేస్తున్నారో కూడా శ్రీలీలకు కూడా అర్థం కావట్లేదు. అసలెప్పుడు వస్తున్నాయో.. ఎప్పుడెళ్తున్నాయో తెలియట్లేదు ఆమె సినిమాలు. గతేడాది రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతరతో వచ్చినా ఫలితం లేదు. కంటెంట్‌పై ఫోకస్ పెట్టమ్మా.. గ్యాప్ తీసుకున్నా పర్లేదంటున్నారు ఫ్యాన్స్. స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం చూస్తున్నారు శ్రీలీల. ఈమె ఆశలన్నీ ఉస్తాద్ భగత్ సింగ్‌పైనే ఉన్నాయిప్పుడు. తమిళంలో శివకార్తికేయన్ పరాశక్తి.. హిందీలో కార్తిక్ ఆర్యన్ సినిమాల్లోనూ నటిస్తున్నారు ఈ బ్యూటీ. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే సైతం మాంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. కాంతా, రామ్ ఆంధ్రాకింగ్ తాలూక నిరాశ పరచడం ఈమెకు మైనస్ అయింది. హిట్ 3 బానే ఆడినా ఆ తర్వాత వచ్చిన తెలుసు కదా ఫ్లాప్‌తో వెనకబడిపోయారు శ్రీనిథి శెట్టి. మంచి కథ దొరికితే గానీ తెలుగులో నటించనంటున్నారు సమంత. అందుకే ఖుషీ తర్వాత ఈమె కనబడలేదు. ఇక పూజాహెగ్డే కూడా తనదైన కమ్ బ్యాక్ కోసం వేచి చూస్తున్నారు. అలాగే నిధి అగర్వాల్ సైతం రాజా సాబ్‌తో హిట్ కొట్టాలని చూస్తున్నారు. త్రిష సినిమాలు చేస్తున్నా.. విజయాల్లేవు. ఈమె ఆశలన్నీ విశ్వంభరపైనే ఉన్నాయి. కీర్తి సురేష్ సైతం తెలుగులో హిట్ కొట్టి చాన్నాళ్లైపోయింది. ఈమె ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధనలో నటిస్తున్నారు. మృణాళ్ ఠాకూర్ అయితే అల్లు అర్జున్, అట్లీ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి కొత్త ఏడాదైనా వీళ్ల కమ్ బ్యాక్ సాధ్యమవుతుందా లేదా చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2026లో దండయాత్రే.. కళ్ల ముందు 5 వేల కోట్లు
బాస్ – వెంకీల ధాటికి దద్దరిల్లిపోతున్న యూట్యూబ్
అప్పుడు దేఖలేదు.. ఇప్పుడు.. ఈ సినిమా గురించే అందరి నోటా మాట
Psych Siddhartha Review: నందు కొత్త స్టైల్ సైక్ సిద్ధార్థ్ సినిమా.. హిట్టా..? ఫట్టా..?
3 రోజుల్లో.. రూ.1000 కోట్ల మద్యం తాగేశారు
న్యూ ఇయర్ విషెష్‌తో ఆకట్టుకుంటున్న కడియం నర్సరీ
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత

