AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో దండయాత్రే.. కళ్ల ముందు 5 వేల కోట్లు

2026లో దండయాత్రే.. కళ్ల ముందు 5 వేల కోట్లు

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jan 02, 2026 | 3:31 PM

Share

2025 తెలుగు చిత్ర పరిశ్రమకు నిరాశను మిగల్చగా, 2026పై భారీ ఆశలున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి, సమ్మర్ సీజన్‌లు బయ్యర్లకు లాభాలు పంచిపెట్టేలా ఉన్నాయి. ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల భారీ సినిమాలు పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి. ఈ ఏడాది రాబోయే ప్రధాన చిత్రాలు, వాటి విడుదల తేదీల సమగ్ర జాబితా ఇదే.

2025 తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా కలిసిరాలేదు. చిన్న సినిమాలు తప్ప పెద్దోళ్లంతా నిరాశనే మిగిల్చారు. బయ్యర్ల ఆశలన్నీ ఆవిరయ్యాయి. దాంతో వాళ్ల ఆశలన్నీ 2026పైనే ఉన్నాయి. ఎప్పట్లాగే 2026 సంక్రాంతి సినిమాలతోనే మొదలు కానుంది. మరి ఈ ఏడాది రాబోయే భారీ సినిమాలేంటి..? అందులో ఏవి ప్యాన్ ఇండియా.. ఏవి ప్యాన్ వరల్డ్..? ఇవన్నీ ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. సంక్రాంతికి మొత్తం 7 సినిమాలు వస్తున్నాయి. జనవరి 9న రాజా సాబ్ భారీ ఎత్తున విడుదల కానుంది. 500 కోట్ల స్టామినా ఉన్న సినిమా ఇది. ప్రభాస్ వచ్చిన మూడ్రోజులకు మన శంకరవరప్రసాద్ గారు జనవరి 12న విడుదల కానుంది. జనవరి 13న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి.. 14న అనగనగా ఒకరాజు.. ఆరోజు సాయంత్రం 5.49 గంటలకు శర్వానంద్ నారినారి నడుమ మురారి సినిమాలు రానున్నాయి. సంక్రాంతి తర్వాత మేజర్ అంటే సమ్మర్ సీజనే. 2026లో మార్చి నుంచే ఎర్లీ సమ్మర్ షురూ కానుంది. మార్చి 19న టాక్సిక్ రానుంది.. అదే రోజు డెకాయిట్ కూడా విడుదల కానుంది. ఇక ఈ రెండు సినిమాలకు పోటీగా వస్తుంది ధురంధర్ 2. ఇక మార్చి 26న ప్యారడైజ్, 27న పెద్ది సినిమాలు రానున్నాయి. ఇందులో నాని రాకపై అనుమానాలున్నా.. చరణ్ మాత్రం పక్కా. 2026 సమ్మర్ సీజన్ అంతా ఇంట్రెస్టింగ్ మూవీస్ క్యూలో ఉన్నాయి. అందులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ముందుంది. అలాగే విశ్వంభర సైతం సమ్మర్‌లోనే రానుంది. మే 1న గూడఛారి 2తో అడివి శేష్ రానున్నారు. అలాగే అఖిల్ లెనిన్, నాగ చైతన్య వృషకర్మ, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సమ్మర్‌లోనే రానున్నాయి. ఎన్టీఆర్, నీల్ సినిమా జూన్ 25న లాక్ అయింది. గతేడాది ఒక్క సినిమా కూడా చేయని ప్రభాస్.. ఈ ఏడాది సంక్రాంతికి రాజా సాబ్‌గా వస్తూనే.. 2026 సెకండాఫ్‌లో ఫౌజీతో దండయాత్రకు సిద్ధమవుతున్నారు. రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్ధనతో డిసెంబర్‌లో వేటకు రానున్నారు విజయ్ దేవరకొండ. వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా సైతం 2026లోనే రానుంది. కుదిర్తే బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా కూడా ఇదే ఏడాది రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాస్‌ – వెంకీల ధాటికి దద్దరిల్లిపోతున్న యూట్యూబ్‌

అప్పుడు దేఖలేదు.. ఇప్పుడు.. ఈ సినిమా గురించే అందరి నోటా మాట

Psych Siddhartha Review: నందు కొత్త స్టైల్ సైక్ సిద్ధార్థ్‌ సినిమా.. హిట్టా..? ఫట్టా..?

Vanaveera Review: వన వీర.. మైథలాజికల్ డ్రామా ఎలా ఉందంటే

iBOMMA Ravi: పోలీస్ మార్క్‌ విచారణలో తన కోట్ల సంపాదన బయటపెట్టిన రవి

Published on: Jan 02, 2026 03:27 PM