AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vanaveera Review: వన వీర.. మైథలాజికల్ డ్రామా ఎలా ఉందంటే

Vanaveera Review: వన వీర.. మైథలాజికల్ డ్రామా ఎలా ఉందంటే

Phani CH
|

Updated on: Jan 02, 2026 | 1:43 PM

Share

వన వీర సినిమా పల్లెటూరి కుల రాజకీయాలను రామాయణ నేపథ్యంతో కలగలిపి చూపిన వినూత్న ప్రయత్నం. హీరో అవినాష్ తిరువీధుల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, ఆత్మగౌరవం కోసం ఒక యువకుడు చేసే పోరాటాన్ని కళ్ళకు కట్టింది. మైథలాజికల్ టచ్, శక్తివంతమైన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణలు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ఆలోచించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనేది ఈ పూర్తి రివ్యూలో చూడండి.

కులం కాన్సెప్ట్ తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. దానికి రాజకీయం కూడా తోడైతే అది సక్సెస్ఫుల్ ఫార్ములా అవుతుంది. ఇదే ఫార్ములతో వచ్చిన మరో సినిమానే వన వీర. ఒకవైపు కులం.. మరోవైపు రాజకీయం.. ఈ రెండింటి మధ్య సాగే ఓ యువకుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. వనవీర కథలోకి వెళితే.. గోదావరి జిల్లాలోని వారాపురంలో రఘు అలియాస్ అవినాష్ ఉంటాడు. తనకిష్టమైన బైక్‌తో .. తన ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే రఘు తక్కువ కులంలో పుట్టడంతో అతని కుటుంబాన్ని తక్కువగా చూస్తుంటారు రాజకీయ నాయకులు. ఈక్రమంలోనే ఊరిలో ఎలక్షన్స్ హడావిడి మొదలవుతుంది. మోడ్రన్ రావణుడిగా భావించే విలన్ దేవ అలియాస్ నందు రాజకీయ ర్యాలీ కోసం రఘుకు అత్యంత ఇష్టమైన బైక్‌ను తీసుకుంటారు. ఆ బైక్ కోసం హీరో చేసే పోరాటం, దానికి రామాయణ గాథకు ఉన్న లింక్ ఏంటి..? చివరకు హీరో తన ఆత్మ గౌరవాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు..? అనేదే ఈ సినిమా కథ. మనం ఏ సినిమా చేసినా కూడా అందులో కథ రామాయణం, మహాభారతాలను టచ్ చేయకుండా ఉండదు. మన ఇతిహాసాలకు ఉన్న గొప్పతనం అలాంటిది. ఇప్పుడు వనవీర సినిమాలో కూడా దర్శకుడు కం హీరో అవినాష్ తిరువీధుల ఇదే చేశాడు. సాధారణ పల్లెటూరి రాజకీయాలకు, పురాణాల టచ్ ఇవ్వడం ఈ సినిమా ప్రధాన ఆకర్షణ. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. సినిమా మొదటినుంచి రాజకీయాలను కథను ముడి పెడుతూ వచ్చాడు దర్శకుడు. దాంతోపాటు ఎక్కువసార్లు కులం టాపిక్ తీసుకొచ్చాడు. ఊర్లో అగ్రకులం వాళ్ళు కింద కులం వాళ్ళని ఎలా చూస్తారు అనేది ఇందులో కాస్త లోతుగా చూపించే ప్రయత్నం చేశాడు. కథ కొత్తదేమీ కాదు.. ఉన్న కథను రామాయణానికి లింకు పెట్టి చూపించాలనే ప్రయత్నం చేశాడు. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెనక హనుమంతుడు ఉన్నాడు అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమా చేశాడు హీరో కం డైరెక్టర్ అవినాష్. ఫస్టాఫ్ వరకు ఏదో సాదాసీదాగా వెళ్ళిపోతుంది. మధ్యమధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ బాగానే వాడుకున్నాడు. అయితే మెయిన్ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ట్విస్టులు, ఒక స్పెషల్ క్యామియో సినిమా స్థాయిని పెంచాయి. కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. పూర్తి స్థాయి కమర్షియల్ హంగులు ఆశించే వారికి కొన్ని సన్నివేశాలు సాధారణంగా అనిపించవచ్చు. క్లైమాక్స్ పర్లేదు. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ, వానర సైన్యం, వారధి కట్టే విజువల్స్ చాలా బాగున్నాయి. ఇవి సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. వనవీర ఒక వైవిధ్యమైన ప్రయత్నం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, మైథలాజికల్ టచ్‌తో వచ్చిన ఈ విలేజ్ డ్రామా ప్రేక్షకులను పర్లేదు అనిపిస్తుంది. చిన్న సినిమా అయినా, కంటెంట్, మేకింగ్ పరంగా పెద్ద సినిమా స్థాయిని చూపిస్తుంది. హీరోగా, దర్శకుడిగా అవినాష్ తిరువీధుల మంచి ప్రతిభ కనబరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో, ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించారు. విలన్‌గా నందు నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి పర్లేదు. మరో కీలక పాత్రలో శివాజీ రాజా బాగానే యాక్ట్ చేశాడు. చాలా రోజుల తర్వాత సీనియర్ నటుడు టార్జాన్ ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించాడు. చివర్లో వచ్చే సత్య క్యామియో బాగుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా బానే నటించారు. వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. పల్లెటూరి అందాలను, యాక్షన్ ఎపిసోడ్స్‌ను కెమెరాలో బంధించిన తీరు బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. అవినాష్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. దాన్ని తెరపై చూపించడంలో పర్లేదు అనిపించాడు. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.ఒక ఓవరాల్ గా వన వీర గురించి చెప్పాలంటే విలేజ్ పాలిటిక్స్ విత్ మైథాలజీ..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

iBOMMA Ravi: పోలీస్ మార్క్‌ విచారణలో తన కోట్ల సంపాదన బయటపెట్టిన రవి

Rajinikanth: అనుకున్నది ఒక్కటి.. అవుతోంది ఒక్కటి !! పాపం రజినీ

జనవరి 1 నుంచి మారిన రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం

3 రోజుల్లో.. రూ.1000 కోట్ల మద్యం తాగేశారు

న్యూ ఇయర్‌ విషెష్‌తో ఆకట్టుకుంటున్న కడియం నర్సరీ

Follow Us