న్యూ ఇయర్ విషెష్‌తో ఆకట్టుకుంటున్న కడియం నర్సరీ
తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పల్లా వెంకన్న నర్సరీ రైతులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆల్ట్రానేత్రా, కొలియాస్ వంటి అరుదైన విదేశీ మొక్కలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వేలాది మొక్కల మధ్య కనులపండువగా మారిన నర్సరీల్లో ఫోటోలు తీసుకోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో నూతన సంవత్సర వేళ 2026కి స్వాగతం తెలియజేస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కడియం పల్లా వెంకన్న నర్సరీ రైతులు. నర్సరీల్లోని వేలాది మొక్కలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. విదేశాల్లో ఉండే చెట్లు కడియం నర్సరీలో దర్శనం ఇవ్వడంతో…నూతన సంవత్సర వేల కొత్త శోభ సంతరించుకుంది. ముఖ్యంగా ఆల్ట్రానేత్రా గ్రీన్, ఎల్లో, పింక్, మెండో గ్రాస్, అర్చిపోలియో బ్లాక్, కొలియాస్ రకాలు, సాల్వియా వంటి వేలాది జాతి మొక్కలు ఆకర్షిస్తున్నాయి. కడియం నర్సరీల్లో కన్నుల పండుగగా కనిపిస్తున్న ఈ మొక్కల దగ్గర ఫోటోలు తీసుకోవడానికి సందర్శకులు పోటీ పడుతున్నారు. మరింత సమాచారం కడియపులంక నర్సరీ నుండి మా చీఫ్ రిపోర్టర్ సత్యా అందిస్తారు..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోమాలో ఆసీస్ బ్యాటర్.. ఆరోగ్య పరిస్థితి విషమం
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

