AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు

కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు

Phani CH
|

Updated on: Jan 01, 2026 | 5:20 PM

Share

ఒక వ్యక్తి సింగపూర్‌లో రూ.1.75 కోట్లు అప్పు తీసుకుని, అధిక వడ్డీలు, చక్రవడ్డీలు, పెనాల్టీలతో రూ.147 కోట్లకు చేర్చిన కథ ఇది. సొంత ఇల్లు అమ్మి అద్దెకు ఉంటున్నాడు. సింగపూర్ కోర్టు ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రైవేట్ రుణాల ప్రమాదం, అధిక వడ్డీ రేట్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఉదంతం తీవ్రంగా హెచ్చరిస్తుంది.

ఒక వ్యక్తి అప్పు తీసుకుని.. దానికి వడ్డీలు, చక్రవడ్డీలు, పెనాల్టీలతో మోయలేనంత అప్పు మీదికి తెచ్చుకున్నాడు. రూ.1.75 కోట్ల అప్పు తీసుకుని రుణాల ఉచ్చులో చిక్కి రూ.147 కోట్లు చెల్లించాల్సిన దుస్థితికి చేరుకున్నాడు. ఈ క్రమంలో తన సొంత ఇంటిని కూడా అమ్మేసి.. అదే ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సింగపూర్‌ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అధిక వడ్డీలు వసూలు చేసే ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థల వద్ద అప్పు తీసుకునే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన హెచ్చరిస్తోంది. సింగపూర్‌లోని ఒక లైసెన్స్ పొందిన వడ్డీ వ్యాపారి వద్ద ఆ వ్యక్తి.. అప్పు తీసుకోగా.. అది అతడి జీవితాన్నే తలకిందులు చేసింది. 2010లో ఆ వ్యక్తి తన అవసరాల కోసం సుమారు రూ.1.75 కోట్ల అప్పు తీసుకున్నాడు. అందుకు నెలకు 4 శాతం అంటే ఏడాదికి 48 శాతం చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. వాయిదా చెల్లించడం ఆలస్యమైతే నెలకు 8 శాతం అదనపు వడ్డీ, ఆలస్యంగా చెల్లిస్తే ప్రతీ నెలా రూ.1.75 లక్షలు ఫైన్‌గా నిర్ణయించారు. దీంతో అది కేవలం 4 ఏళ్లలోనే అంటే 2014 నాటికి ఆ అప్పు రూ.21 కోట్లకు చేరింది. 2021 నాటికి అది ఏకంగా రూ.147 కోట్లకు ఎగబాకింది. సింగపూర్‌లో 2015 అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం లైసెన్స్ పొందిన వడ్డీ వ్యాపారులు నెలకు 4 శాతానికి మించి వడ్డీ వసూలు చేయకూడదు. లేట్ పేమెంట్ ఫీజు నెలకు రూ.4200కు మించకూడదు. కానీ ఈ వ్యక్తి అప్పు 2010లో తీసుకోవడం వల్ల పాత నిబంధనల లొసుగులను వడ్డీ వ్యాపారి అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అంత తక్కువ అప్పు అంత భారీ స్థాయికి ఎలా చేరిందనే దానిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత

బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..

మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

రూ. 15 వేల లోపు స్మార్ట్‌ఫోన్లు ఫీచర్లు మాములుగా లేవు

Best FD Interest Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా? ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు