జనవరి 1 నుంచి మారిన రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం
జనవరి 1, 2026 నుండి పలు కొత్త ఆర్థిక నియమాలు అమలులోకి వచ్చాయి. ఐటీఆర్ దాఖలు గడువు, పాన్-ఆధార్ లింక్ గడువు ముగియడంతో ఆర్థిక నష్టాలు తప్పవు. సిబిల్ స్కోర్ వారానికోసారి అప్‌డేట్ అవుతుంది. వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ ధరలు పెరిగాయి. ఈ కీలక మార్పులను తెలుసుకుని ఆర్థికంగా నష్టపోకుండా ఉండటం అవసరం.
క్యాలెండర్ మారింది. 2025వ ఏడాది ముగియడంతో గురువారం 2026వ సంవత్సరంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాం. నూతన సంవత్సరం వచ్చిందంటే కొత్త ప్రణాళికలు వేసుకుంటాం. మన ప్రణాళికలు ఎలా ఉన్నా…కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టడంతో దేశంలో అనేక మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. మనల్ని ఆర్ధికంగా ప్రభావితం చేసే ఈ కొత్త విషయాల గురించి ప్రతీఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరముంది. లేకపోతే ఆర్ధికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఆ రూల్స్ ఏంటో ఓసారి చూసేద్దాం. డిసెంబర్ 31వ తేదీతో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఇన్‌కమ్ రిటర్న్స్ పొందేందుకు దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. జనవరి 1 తేదీ నుంచి ఇక దాఖలు చేయలేరు. అలాగే ఐటీఆర్-U కూడా దాఖలు చేసేందుకు అవకాశం లేదు. దీంతో ఇప్పటివరకు గత ఆర్ధిక సంవత్సరానికి చెందిన రిటర్న్స్ దాఖలు చేయనివారు నష్టపోనున్నారు. సెప్టెంబర్ 16వ తేదీలోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అవకాశం కల్పించింది. ఆ తర్వాత లేట్ ఫీజు చెల్లించి దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు సమయం ఇచ్చింది. ఇప్పుడు ఆ గుడువు కూడా ముగిసింది. జనవరి 1వ తేదీ నుంచి సిబిల్ స్కోర్‌లో మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి మాత్రమే క్రెడిట్ స్కోర్‌ను బ్యాంకులు అప్‌డేట్ చేసేవి. ఇక నుంచి వారానికి ఒకసారి బ్యాంకులు సిబిల్ స్కోర్‌ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీ ఆర్ధిక వివరాలు అన్నీ వేగవంతంగా సిబిల్ స్కోర్‌లో ప్రతిబింబించనున్నాయి. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి డిసెంబర్ 31తో డెడ్ లైన్ ముగిసింది. దీంతో ఇవాళ్టి నుంచి ఇక లింక్ చేసుకోలేరు. దీని వల్ల పాన్ కార్డు విషయంలో లింక్ చేసుకోనివారికి ఇబ్బందులు తప్పవు. ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించలేరు. పాన్ కార్డును ఆర్థిక శాఖ ఇనాక్టివ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మారుతాయి. జనవరి 1 రావడంతో కొత్త ధరలను ఆయిల్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.111లు పెంచాయి. గృహవినియోగ సిలిండర్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
3 రోజుల్లో.. రూ.1000 కోట్ల మద్యం తాగేశారు
న్యూ ఇయర్ విషెష్‌తో ఆకట్టుకుంటున్న కడియం నర్సరీ
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత

