Rajinikanth: అనుకున్నది ఒక్కటి.. అవుతోంది ఒక్కటి !! పాపం రజినీ
సూపర్‌స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో అరుదైన పరిస్థితి. జైలర్ 2 తర్వాత ఆయన తదుపరి చిత్ర దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు. కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాకు సుందర్ సి, రామ్ కుమార్, అశ్వత్ మారిముత్తు వంటి పేర్లు వినిపించినా అధికారిక ప్రకటన లేదు. ఆరోగ్యం, రిటైర్‌మెంట్ వార్తల నేపథ్యంలో రజినీ నాణ్యమైన, వేగవంతమైన దర్శకులను ఎంచుకుంటున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నడూ లేని స్థితి ఏర్పడింది. జైలర్ 2 తర్వాత ఆయన చేయబోయే సినిమాకు దర్శకుడు ఫిక్స్ కాకపోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కమల్ హాసన్ నిర్మాణంలో రెండు సినిమాలకు రజనీ కమిట్ అయ్యారు. వీటిలో మొదటి ప్రాజెక్ట్‌కు సుందర్ సి దర్శకత్వం చేయనున్నట్టు మొదట్లో అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశారు కమల్. కానీ కొద్ది రోజులకే సుందర్ సి వెనక్కి తగ్గడంతో ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడింది. అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతూనే ఉండడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. సుందర్ సీ తర్వాత.. రజినీ సినిమాకు డైరెక్టర్‌గా ‘పార్కింగ్’ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ ఫిక్స్ అయ్యాడనే టాక్ వచ్చింది. ఆయన రజనీకి స్క్రిప్ట్ నెరేషన్ ఇచ్చి సూపర్‌స్టార్‌ను ఆకట్టుకున్నారని ఓ వార్త వైరల్ అయింది. కానీ ఇప్పటివరకు అధికారిక అనౌన్స్‌మెంట్ రాలేదు. ఇక ఇప్పుడు ‘డ్రాగన్’ సినిమాతో హిట్ అందుకున్న అశ్వత్ మారిముత్తు రజినీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. అశ్వత్ రజనీకి బౌండ్ స్క్రిప్ట్ చెప్పి ఆకట్టుకున్నట్లు చెన్నై వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి జనవరి 2026లో అధికారిక ప్రకటన రావచ్చని అంచనా వేస్తున్నారు. నిజానికి రజనీకాంత్‌కు ఇలాంటి సందిగ్ధం ఎప్పుడూ ఎదురుకాలేదు. ఆరోగ్య కారణాలతో సినిమాల స్పీడ్ తగ్గించాలని నిర్ణయించుకున్న ఈ సూపర్‌స్టార్, ఇంకా మూడేళ్లలో రిటైర్‌మెంట్ ప్రకటన చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కెరీర్ చివరి దశలో చేసే సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారట. త్వరగా షూటింగ్ పూర్తి చేసి, హై క్వాలిటీ ఇచ్చే దర్శకులనే ఎంచుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రమే రజినీ అంచనాలను అందుకున్నాడని టాక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జనవరి 1 నుంచి మారిన రూల్స్.. తెలుసుకోకపోతే మీకే నష్టం
3 రోజుల్లో.. రూ.1000 కోట్ల మద్యం తాగేశారు
న్యూ ఇయర్ విషెష్‌తో ఆకట్టుకుంటున్న కడియం నర్సరీ
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత

