ఓరి మీ ఏషాలో.. న్యూ ఇయర్ వేళ మందుబాబుల హంగామా
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. మద్యం సేవించి దొరికిపోయిన పలువురు అరెస్టుల సమయంలో నానా హంగామా చేశారు. కొందరు ఏడుస్తూ, మరికొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ తమ వాహనాలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలు కొత్త సంవత్సర స్వాగత వేళ నగరంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
మామూలు రోజుల్లోనే మందుబాబులను పట్టుకోలేం.. ఇక న్యూ ఇయర్ వేళ వాళ్లు ఆగుతారా.. అదే జరిగింది.. కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే నెపంతో ఫుల్‌గా మద్యం సేవించి అర్ధరాత్రి నానా హంగామా చేశారు. మరి పోలీసులు చూస్తూ ఊరుకుంటారా.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కేసులు నమోదు చేసి, మందుబాబుల వాహనాలను సీజ్ చేశారు. దీంతో వారు పోలీసులకు చుక్కలు చూపించారు. మా వాహనాలు మాకిచ్చేయండి అంటూ వింత వింత విన్యాసాలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు.. ఫుల్లుగా మద్యం తాగి పోలీసులకు దొరికిపోయి నానా హంగామా చేశారు. పాతబస్తీ ఫలక్‌నుమాలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిన ఓ వ్యక్తి రోడ్డుకు అడ్డంగా పడుకుని బోరున ఏడ్చాడు. బండి లేకుండా వెళ్తే..ఇంట్లో వాళ్లు తిడతారని, ఎలాగైనా బండి ఇప్పించాలని పోలీసులను వేడుకున్నాడు. కుల్సుంపురాలో డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన మరో వ్యక్తి ‘కొత్త సంవత్సరం కాబట్టి ఓ పెగ్గు ఎక్కువ తాగాను.. కానీ మీ మిషన్ ఫుల్‌గా మద్యం తాగినట్టు చూపిస్తోంది.. మీ మిషన్ ఫేక్’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఇక నాంపల్లిలో జరిపిన తనిఖీల్లో మందు తాగి అడ్డంగా దొరికిపోయిన ఓ యువకుడు పోలీసులకు చుక్కలు చూపించాడు, తన బైక్ తనకు ఇచ్చేయాలంటూ తల గోడకేసి కొట్టుకున్నాడు. వర్కవుట్ కాకపోయేసరికి పోలీసుల కాళ్లు పట్టుకొని నానా హంగామా సృష్టించాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్త ఏడాది వేళ.. స్విట్జర్లాండ్ బార్‌లో బాంబ్ బ్లాస్ట్ !!
విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?
Teja Sajja: నేను విన్నాను.. నేనున్నాను అంటున్న హీరో
ఓరి మీ ఏషాలో.. న్యూ ఇయర్ వేళ మందుబాబుల హంగామా
3 రోజుల్లో.. రూ.1000 కోట్ల మద్యం తాగేశారు
న్యూ ఇయర్ విషెష్తో ఆకట్టుకుంటున్న కడియం నర్సరీ
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు

