AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా ఇంజనీర్ల మరో అద్భుతం.. అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం

చైనా ఇంజనీర్ల మరో అద్భుతం.. అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం

Phani CH
|

Updated on: Dec 31, 2025 | 9:13 PM

Share

చైనా ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్, తియాన్షాన్ షెంగ్లీని షిన్జియాంగ్‌లో ప్రారంభించింది. 22 కిలోమీటర్ల ఈ టన్నెల్ ఉత్తర, దక్షిణ షిన్జియాంగ్ మధ్య ప్రయాణ సమయాన్ని 7 గంటల నుండి 3.5 గంటలకు తగ్గించింది. అత్యంత కఠిన పరిస్థితుల్లో 5 ఏళ్ళపాటు నిర్మించిన ఈ ప్రాజెక్ట్, ప్రపంచంలోనే లోతైన నిలువు షాఫ్ట్‌ను కూడా కలిగి ఉంది. ఇది చైనా ఇంజినీరింగ్ సామర్థ్యానికి నిదర్శనం.

ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ ఎక్స్‌ప్రెస్‌వేను చైనా నిర్మించింది. మొత్తం 22 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్.. ఉత్తర, దక్షిణ షిన్జియాంగ్ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గించనుంది. అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లో కూడా చైనా ఇంజినీర్లు.. 5 ఏళ్ల పాటు కష్టపడి.. ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి చేశారు. చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతమైంది. ఉత్తర, దక్షిణ షిన్జియాంగ్‌ను వేరుచేసే తియాన్షాన్ పర్వత శ్రేణులను తొలిచి నిర్మించిన తియాన్షాన్ షెంగ్లీ టన్నెల్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. షిన్జియాంగ్ ప్రాంతంలో 22.13 కిలోమీటర్ల పొడవైన తియాన్షాన్ షెంగ్లీ టన్నెల్‌ను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌గా రికార్డు సృష్టించింది. దీని వల్ల ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 7 గంటల నుంచి మూడున్నర గంటలకు తగ్గింది. కఠినమైన వాతావరణంలో 5 ఏళ్ల పాటు శ్రమించి చైనా ఇంజనీర్లు ఈ అద్భుతాన్ని పూర్తి చేశారు. డిసెంబర్ 26వ తేదీన ఈ టన్నెల్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు రెండు ప్రపంచ రికార్డులను సృష్టించిందని చైనా కమ్యూనికేషన్స్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్, అత్యంత లోతైన నిలువు షాఫ్ట్. ఈ ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్ కోసం నిర్మించిన అత్యంత లోతైన వర్టికల్ షాఫ్ట్ దాదాపు 706 మీటర్లు ఉంటుంది. ఇది షాంఘై టవర్ కంటే ఎత్తైంది కావడం గమనార్హం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి

జీమెయిల్ వాడుతున్నారా..? ఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్

ఏపీలో ఇక.. 28 జిల్లాలు.. ఉనికిలోకి రానున్న 2 కొత్త జిల్లాలు

శ్రీవారి భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు

కనిగిరికి రైలు.. సాకారమైన 30 ఏళ్ళ కల