AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీమెయిల్ వాడుతున్నారా..? ఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్

జీమెయిల్ వాడుతున్నారా..? ఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్

Phani CH
|

Updated on: Dec 31, 2025 | 9:01 PM

Share

జిమెయిల్ యూజర్‌లకు శుభవార్త! మీ ఇమెయిల్ ఐడీ పేరును మార్చుకునే సరికొత్త ఫీచర్‌ను గూగుల్ పరిచయం చేసింది. గతంలో ఐడీ సృష్టించిన తర్వాత పేరు మార్చే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఈ కొత్త అప్‌డేట్‌తో మీ యూజర్‌నేమ్‌ను సులభంగా మార్చుకోవచ్చు. అయితే, దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి: ఒకసారి మార్చాక ఏడాదిపాటు వేచి చూడాలి, మొత్తం మూడుసార్లు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది.

ఈ రోజుల్లో ఈ మెయిల్ అనేది ప్రతీఒక్కరికీ అవసరమే. మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగ అవససరాలు లేదా వ్యాపారం చేస్తుంటే బిజినెస్ అవసరాల కోసం మెయిల్ అనేది తప్పనిసరి. ఇక విద్యార్థులకు కూడా ఫైల్స్‌ను భద్రపర్చుకోవడానికి, విద్యాపరంగా ఇతర పనులకు మెయిల్ అనేది ఉపయోగపడుతుంది. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది జీమెయిల్ వాడుతుంటారు. గూగుల్‌కు చెందిన జీమెయిల్ ఎప్పటినుంచో ఉండగా అది బాగా పాపులర్ అయింది. ఇప్పుడు మార్కెట్లో యాహూ, ఔట్‌లుక్ లాంటి ఎన్నో మెయిల్ ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నా.. జీమెయిల్‌కు అలవాటు పడి చాలా మంది అదే ఎక్కువగా వాడుతున్నారు. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ఏదోక ఫీచర్‌ను జీమెయిల్ తీసుకొస్తోంది. తాజాగా మరో అదిరిపోయే ఆప్షన్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు జీమెయిల్ ఐడీ నేమ్‌ను మార్చుకునే వెసులుబాటు అందుబాటులో లేదు. మీరు జీమెయిల్ కొత్తగా క్రియేట్ చేసే సమయంలో ఏ నేమ్‌తో మెయిల్ ఐడీ అయితే ఎంచుకున్నారో.. అది తర్వాత మార్చుకోవడానికి కుదరలేదు. కొంతమంది తమ చిన్నతనంలో తెలియక స్నేహితుల ఒత్తిడితో క్రియేట్‌ చేసుకున్న పేరు పెద్దయ్యాక నచ్చక మార్చుకోవాలన్నా ఇప్పటిదాకా ఆ ఆప్షన్‌ అందించలేదు గూగుల్‌. అలాంటివారు తర్వాత దానిని మార్చుకోవాలంటే అసలు కుదరలేదు. దాంతో కొత్తగా మరో ఐడీని యూజర్లు క్రియేట్ చేసుకున్నారు. పాత మెయిల్ ఐడీలో తమ డేటా ఉంటుంది గనుక ఆ ఐడీని అలాగే కంటిన్యూ చేయచ్చు. ఇక నుంచి మీరు మెయిల్ ఐడీని మార్చుకోవచ్చు. అవును జీమెయిల్ కొత్తగా ఈ ఫీచర్ తీసుకొచ్చింది. గూగుల్ సపోర్ట్ పేజీలో ఈ ఆప్షన్ ప్రస్తుతం కనిపిస్తుంది. ఒకసారి మీరు ఐడీ నేమ్ మార్చుకున్న తర్వాత ఏడాది వరకు మార్చుకోవడానికి కుదరదు. అంతేకాకుండా ఇలా కేవలం మూడుసార్లు మాత్రమే జీమెయిల్ ఐడీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా.. త్వరలో అందరికీ రానుందని తెలుస్తోంది. మీరు మెయిల్ ఐడీ నేమ్‌ను మార్చుకున్నా మీ డేటా అలాగే ఉంటుంది. లాస్ట్‌లో ఉండే @జీమెయిల్ తప్ప మిగతాది మీరు మార్చుకోవచ్చు. మనిషికి రెండు పేర్లు ఉన్నట్లే ఇక నుంచి జీమెయిల్‌కు కూడా రెండు యూజర్ నేమ్‌లు ఉండేలా ఈ ఆప్షన్ అభివృద్ది చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీలో ఇక.. 28 జిల్లాలు.. ఉనికిలోకి రానున్న 2 కొత్త జిల్లాలు

శ్రీవారి భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు

కనిగిరికి రైలు.. సాకారమైన 30 ఏళ్ళ కల

ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి

Follow Us