AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి

పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి

Phani CH
|

Updated on: Dec 31, 2025 | 9:08 PM

Share

దక్షిణ కొరియాలో పాత ఎయిర్ కండిషనర్లలో 24 క్యారెట్ల బంగారు లోగోలు ఉన్నాయని వైరల్ వీడియో వెల్లడించింది. 2005, 2008లో పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేసిన ఏసీ మోడల్స్‌లో ఈ లోగోలు ఉన్నాయని తెలిసింది. దీనితో ప్రజలు తమ పాత ఏసీలను పరిశీలించడం ప్రారంభించారు. ఒక లోగోకు $482 డాలర్ల వరకు విలువ లభిస్తోంది, ఇది వినియోగదారులకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది.

దక్షిణ కొరియాలో 20 ఏళ్ల కిందటి ఓ ప్రముఖ కంపెనీకి చెందిన ఎయిర్ కండిషనర్ అకస్మాత్తుగా అత్యంత విలువైన వింటేజ్ వస్తువుగా మారిపోయింది. ఈ ఎయిర్ కండిషనర్ పై ఉన్న లోగో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారంటూ ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రజలు తమ ఇళ్లలో పాత ఎయిర్ కండిషనర్ల కోసం వెతకడం ప్రారంభించారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోను సియోల్‌కు చెందిన బంగారు దుకాణ యజమాని పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఉన్నఎయిర్ కండిషనర్లలో బంగారం ఉందా? అనే క్యాప్షన్‌ జోడించారు. ఈ క్లిప్‌లో ఒక కస్టమర్ కొన్ని లోహపు ముక్కలను చూపిస్తున్నాడు. ఈ ముక్కలు సదరు కంపెనీ ఎయిర్ కండిషనర్ ముందు భాగంలో ఉన్న లోగో నుండి తీసుకున్నట్టు కస్టమర్ వివరించాడు. ఆ సమయంలో డెలివరీ సిబ్బంది కూడా లోగో బంగారంతో చేసిందే అని నిర్ధారించారు. ఆ లోగోను కరిగించగా అది 24 క్యారెట్ల బంగారంగా తేలింది. పరీక్షించిన తర్వాత, కస్టమర్‌కు ఫోన్ చేసి అది 18-క్యారెట్ల బంగారం కాదని, స్వచ్ఛమైన బంగారం అని చెప్పారు. లోగో బరువు ఒక డాన్ కంటే కొంచెం తక్కువ. దీంతో కస్టమర్‌కు 713,000 వోన్స్‌ అంటే సుమారు $482 డాలర్లు లభిస్తాయి. డాన్‌ అంటే దక్షిణ కొరియాలో బంగారం బరువును కొలిచే సాంప్రదాయ యూనిట్. ఒక డాన్ అంటే దాదాపు 3.75 గ్రాములకు సమానం. ఒక డాన్ బంగారం విలువ దాదాపు 890,000 వోన్లు అని చెబుతారు. ఈ వీడియోను ఏకంగా మిలియన్‌ కంటే ఎక్కుమంది వీక్షించారు. వందలాది మంది ఇప్పుడు తమ ఇళ్లలోని ఆ కంపెనీ పాత ACలను తనిఖీ చేస్తామని వ్యాఖ్యానించారు. ఒక వినియోగదారు అమ్మమ్మ అయితే.. తమ ఇంట్లో ఉన్న AC చాలా పాతది, అది ఆ కంపెనీదా కాదా అని చెక్‌ చేయాలి అని కామెంట్ రాసుకొచ్చారు. చాలా మంది ఇతరులు ఇలాంటి వస్తువులను గతంలో వ్యర్థాలుగా భావించి వాటిని పారవేశామంటూ బోరుమంటున్నారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత మరొక కస్టమర్ తన ఏసీ లోగోతో వచ్చాడు. గోల్డ్ ఎక్స్ఛేంజ్ వాళ్లు సర్టిఫికెట్ లేకుండా దానిని బంగారంగా అంగీకరించడానికి నిరాకరించిందన్నారు. ఈసారి పరీక్షలో అది స్వచ్ఛమైన బంగారంగా తేలడంతో దాని విలువ 7,48,000 వోన్స్‌ గా అంచనా వేశారు. చోసన్ డైలీ నివేదిక ఏం చెప్పిందంటే.. ఆ కంపెనీ ఏసీల్లో కొన్ని మోడళ్లలో మాత్రమే బంగారాన్ని ఉపయోగించారని స్పష్టం చేసింది. వాస్తవానికి, 2005లో ఆ కంపెనీ.. తన ఐదు సంవత్సరాల వరుస నంబర్ వన్ ఎయిర్ కండిషనర్ అమ్మకాలను జరపడానికి 24-క్యారెట్ల బంగారు లోగోను కలిగి ఉన్న 10,000 పరిమిత-ఎడిషన్ ACలను ఉత్పత్తి చేసింది. 2008లో కంపెనీ కొన్ని మోడళ్లకు 1 డాన్ స్వచ్ఛమైన బంగారు నేమ్‌ప్లేట్‌ను కూడా పెట్టింది. దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జీమెయిల్ వాడుతున్నారా..? ఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్

ఏపీలో ఇక.. 28 జిల్లాలు.. ఉనికిలోకి రానున్న 2 కొత్త జిల్లాలు

శ్రీవారి భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు

కనిగిరికి రైలు.. సాకారమైన 30 ఏళ్ళ కల