ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
సంక్రాంతి వస్తున్న వేళ చైనా మాంజా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కీసరలో మాంజా తెగిపడి 19 ఏళ్ల జశ్వంత్ మెడకు తీవ్ర గాయాలయ్యాయి. నిషేధం ఉన్నా విచ్చలవిడిగా అమ్ముతున్న చైనా మాంజా వల్ల మనుషులతో పాటు పశుపక్ష్యాదులకూ ప్రాణాపాయం. విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, జశ్వంత్ తండ్రి డిమాండ్ చేయడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
సంక్రాంతి వస్తోంది… సరదాలు తెస్తోంది అనుకునే లోపే…మళ్లీ చైనా మాంజా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గతంలో జరిగిన ఘటనలను గుర్తుకు తెస్తోంది. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో…మాంజా మెడకు చుట్టుకుని…ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మల్లికార్జున నగర్ కాలనీలో మాంజా దారం తెగిపడి జస్వంత్ అనే 19ఏళ్ల జశ్వంత్ అనే యువకుడికి మెడ భాగంలో కట్ అయింది. దీంతో అతగాడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ప్రస్తుతం జశ్వంత్ కోలుకుంటున్నాడు. కీసరలో చైనా మాంజాను దుకాణదారులు విచ్చలవిడిగా విక్రయిస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జశ్వంత్ తండ్రి సుధాకర్. ఒకరి సరదా.. మరొకరి ప్రాణాల మీదకు తెస్తుందని ఈ సందర్భంగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంక్షలు విధించడమే కానీ మాంజా విక్రయాలపై నిఘా పెట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. జశ్వంత్ ఘటనతో అలెర్టయిన పోలీసులు కీసరలో గాలి పటాల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మాంజా విక్రయించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు.. చైనా మాంజా మీద నిషేధం ఉన్నా కొందరు వ్యాపారులు మార్కెట్లో విచ్చలవిడిగా దాన్ని విక్రయించేస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో మాంజా దారం వల్ల మెడ కోసుకుని ఆర్మీకి చెందిన ఓ సోల్జర్ మరణించారు. అప్పట్లో ఆ ఘటన కలకలం సృష్టించింది. మనుషులతో పాటు పశుపక్ష్యాదుల పాలిట కూడా, చైనా మాంజా యమ డేంజర్‌గా మారుతోంది. మాంజా దారం చుట్టుకుని పక్షులు చనిపోయిన ఘటనలు కోకొల్లలు. ఇక తెలంగాణ వ్యాప్తంగా చైనా మాంజా దారం, ఎంతోమంది పాలిట యమపాశంగా మారింది. తాజా ఘటనతో అయినా, పోలీసులు మేల్కొని, చైనా మాంజా విక్రేతలపై కఠినచర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనా ఇంజనీర్ల మరో అద్భుతం.. అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్ నిర్మాణం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
జీమెయిల్ వాడుతున్నారా..? ఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?

