డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
నెదర్లాండ్స్ ఫ్లెవోలాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ ద్వీపం. సముద్రాన్ని జయించి, డైక్‌లు నిర్మించి, నీటిని పంప్ చేసి, బురదను సారవంతమైన భూమిగా మార్చే డచ్ ఇంజనీరింగ్ అద్భుతం ఇది. ఈ ప్రక్రియ వల్ల తాగునీటి సరస్సులు, సారవంతమైన వ్యవసాయ భూములు ఏర్పడ్డాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో సముద్ర మట్టాల పెరుగుదలను ఎదుర్కొనేందుకు డచ్ విధానాలు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
భూభాగం తక్కువగా ఉన్నప్పటికీ.. సముద్రం తమను మింగేస్తున్నా ఏమాత్రం భయపడకుండా.. ఏకంగా సముద్రంలోనే అతిపెద్ద కృత్రిమ ద్వీపాన్ని నెదర్లాండ్స్ నిర్మించింది. అదే నెదర్లాండ్స్‌లోని 12వ రాష్ట్రంగా ఫ్లెవోలాండ్ ఏర్పడింది. తమ దేశపు తీర ప్రాంతాన్ని మింగేస్తున్న సముద్రుడి దూకుడుకు చెక్ పెట్టి.. వినూత్న మైన ఆధునిక విధానాలతో అక్కడి పరిశోధకులు, ఇంజనీర్లు కొత్త పట్టణాలు, నగరాలు నిర్మిస్తున్నారు. ఈ విధానంలో ముందుగా సముద్రంలో డైక్స్‌ను నిర్మిస్తారు. డైక్స్ అంటే సముద్రం మధ్యలో పెద్ద గట్లను కట్టడం. గట్లు కట్టిన తర్వాత ఆ గట్ల మధ్య ఉన్న నీటిని భారీ మోటర్ల సాయంతో తిరిగి సముద్రంలోకి పంపిస్తారు. ఇప్పుడు అత్యాధునిక విద్యుత్ పంపులు అందుబాటులోకి రావడంతో పని మరింత సులభం అయింది. నీటిని మొత్తం బయటికి పంపించిన తర్వాత.. బురద ఏర్పడుతుంది. విమానాల నుంచి ఆ బురదలో గడ్డి విత్తనాలను చల్లి, అవి మొలిచి బాగా పెరిగే వాతావరణాన్ని కల్పిస్తారు. ఆ కలుపు మొక్కలు ఎదిగేకొద్దీ.. అక్కడి భూమిలో తేమ తగ్గి.. నేల గట్టిపడిపోతుంది. ఆ తర్వాత క్రమంగా ఆ భూమిని నివాసాలకు అనువుగా మార్చుతారు. ప్రస్తుతం వేల సంఖ్యలో ప్రజలు నివసిస్తున్న ఫ్లెవోలాండ్.. వందేళ్ల క్రితం సముద్రపు అడుగుభాగంగా ఉండేది. చివరికి 1986 జనవరి 1వ తేదీన అధికారికంగా ఫ్లెవోలాండ్ పేరుతో నెదర్లాండ్స్ 12వ రాష్ట్రాన్ని ప్రకటించింది. సముద్రం నుంచి సేకరించిన భూమికి.. సముద్రపు నీటికి మధ్య సంబంధం లేకుండా కొన్ని పాయలను మూసివేయడం వల్ల కొన్నేళ్లకు అవి మంచి నీటి సరస్సులుగా మారాయి. ఇప్పుడు ఆ మంచి నీటి సరస్సులే.. నెదర్లాండ్స్‌లో ప్రజల తాగునీటికి, వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి. వాటిపై నిర్మించిన డ్యామ్‌ల పైన రోడ్లను నిర్మించడం వల్ల వివిధ ద్వీపాల మధ్య రవాణా సౌకర్యం పెరిగింది. డచ్ ఇంజినీర్ల నిరంతర కృషి వల్ల నెదర్లాండ్స్ కేవలం భూమిని మాత్రమే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములను కూడా తయారు చేసుకుంది. ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న సముద్ర మట్టాలను ఎదుర్కోవడంలో డచ్ ఇంజనీర్లు ప్రపంచానికే మార్గదర్శకులుగా నిలిచారు. దీంతో ప్రస్తుత సమయంలో సముద్ర మట్టాలు పెరుగుతుండటాన్ని ఎదుర్కోనేందుకు అమెరికా, వియత్నాం వంటి దేశాలు డచ్ ఇంజనీర్ల సలహాలను తీసుకుంటున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనా ఇంజనీర్ల మరో అద్భుతం.. అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్ నిర్మాణం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో

