Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు రోజూ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అమెరికా ఆర్థిక పరిణామాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో ఈ లోహాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం 24 క్యారెట్ల బంగారం రూ.1140, వెండి కిలో రూ.4 వేలు పెరిగాయి. హైదరాబాద్, విజయవాడతో సహా పలు నగరాల్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొనుగోలు చేసే ముందు ధరలు తనిఖీ చేయాలని సూచన.
ఒకరోజు పెరిగితే.. ఒకరోజు తగ్గుతూ.. పబ్లిక్ బ్రెయిన్‌తో గోల్డ్, సిల్వర్ రేట్స్ గేమ్స్ ఆడుతున్నాయి. సాధారణంగా అంతర్జాతీయ పరిణామాలు సరిగ్గా ఉండి ఉంటే.. ఈ మెటల్స్ ధరల్లో మార్పులు పెద్దగా ఉండేవి కాదు. కానీ అమెరికాలో ఆర్థిక పరిణామాలు, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఈ మెటల్స్ ధరల పెరుగుదలకు ఊతం అందిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించంతోపాటు లాంగ్ పొజిషన్ల నుంచి వెనక్కి తగ్గడంతో ఈ గోల్డ్, సిల్వర్ ధరలు యూటర్న్ తీసుకున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయ్. తాజాగా ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1140 మేర పెరిగి రూ. 1,36,200 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1050 పెరిగి రూ.1,24,850 పలుకుతోంది. వెండి కిలోపై రూ. 4 వేలు పెరిగి రూ. 2,60,000 పలుకుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,36,350, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,000 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,200 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,24,850 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,240, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,800 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,200 ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,850 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,36,200 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,24,850 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,60,000 పలుకుతోంది. ఈ ధరలు మధ్యాహ్నం 1 గంటకు నమోదైనవి. ఇవి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 30 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకునే ఫెసిలిటీ
కలవరపెడుతున్న స్క్రబ్ టైఫస్..22 మంది మృతి
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

