BSNL: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త..
బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా వైఫై కాలింగ్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోనూ స్పష్టమైన, అధిక నాణ్యత గల కాల్స్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ లేదా ఇతర వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించి, ప్రత్యేక యాప్ లేకుండానే కాల్స్ చేయవచ్చు. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడమే దీని లక్ష్యం.
నూతన సంవత్సరం వేళ తమ కస్టమర్లకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా వైఫై కాలింగ్ సేవలను అందుబాబులోకి తెచ్చింది. ఈ సేవ BSNL కస్టమర్లకు ఇప్పుడు అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉంది. ఈ వైఫై కాలింగ్‌తో నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోనూ స్పష్టమైన, అధిక నాణ్యత కలిగిన కాల్స్ చేసుకోవచ్చు. మొబైల్ సిగ్నల్ సరిగా లేని బేస్‌మెంట్‌లు, బహుళ అంతస్తుల భవనాల లోపలి భాగాలు, మారుమూల ప్రాంతాల్లో స్పష్టమైన వాయిస్ కాల్స్ అందించడమే ఈ టెక్నాలజీ ప్రధాన లక్ష్యం. వినియోగదారులు తమకు అందుబాటులో ఉన్న బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ లేదా ఇతర ఏదేని వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించి, తమ ఫోన్‌లోని సాధారణ డయలర్ నుంచే నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను ఆధునికీకరించే కార్యక్రమంలో భాగంగానే ఈ వాయిస్ ఓవర్ వైఫై సేవలను తీసుకొచ్చినట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా సరైన సేవలు లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొంది. ఈ సేవలను పొందడానికి వాయిస్ ఓవర్ వైఫైకి సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోతుంది. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘వైఫై కాలింగ్’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త సేవతో బీఎస్ఎన్ఎల్ కూడా జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వంటి ప్రైవేట్ టెల్కోల సరసన చేరినట్లయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పడవ పందేల ట్రయల్ రన్ లో అపశృతి
Naa Anveshana: అన్వేష్ యూజర్ ID వివరాలు ఇవ్వాలని ఇన్‌స్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
మరింత వణికించనున్న జనవరి.. పెరగనున్న చలి తీవ్రత
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

