మరింత వణికించనున్న జనవరి.. పెరగనున్న చలి తీవ్రత
తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. డిసెంబర్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైన తర్వాత, జనవరిలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తా, రాయలసీమలలో తక్కువ ఉష్ణోగ్రతలు, ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. నవంబరు నెలలో చలిపులి పంజా విసరడం మొదలు పెట్టగా..డిసెంబర్ మొత్తం గజగజలాడించింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ మరో బాంబ్ పేల్చింది. జనవరి నెలలో చలితీవ్రత మరింత పెరగనుందని వెల్లడించింది. గత రెండు, మూడు రోజుల నుంచి కాస్త చలి తగ్గినప్పటికీ మునుముందు రోజుల్లో చలి తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈశాన్య, తూర్పు దిశల్లో చలి గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల 2 రోజులు ఉత్తర కోస్తా, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలలో మార్పు ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత 3 రోజులు అక్కడక్కడ సాధారణం కంటే 2-3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఏపీలో మన్యం ప్రాంతాలను చలి గజగజా వణికిస్తోంది. పాడేరు జిల్లా కేంద్రంలో… తెల్లవారుజాము నుంచి ఉదయం పదిన్నర గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది. దీంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మినుములూరు 8, పాడేరు 10, అరకు 11, చింతపల్లిలో 15.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండుమూడు రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుందని IMD పేర్కొనడంతో జనం బెంబెలెత్తుతున్నారు. తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో జనవరి 1 బుధవారం వరకు సింగిల్ డిజిట్ గా ఉన్న ఉష్ణోగ్రతలు డబల్ డిజిట్ కు చేరుకున్నాయి. కొంతమేర చలి తీవ్రత తగ్గుముఖం పట్టినా మునుముందు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆదిలాబాద్, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్, మెదక్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి ,వరంగల్, వికారాబాద్, జనగాం, జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో ఉదయం పూట పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. ఈ పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నల్గొండ జిల్లా చిట్యాల, చౌటుప్పల్ మధ్యలో దట్టమైన పొగ మంచు అలుముకుంటోంది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా పొగ మంచు కురుస్తోంది. హైవేపై హెవీ ఫాగ్ ఉండడంతో….వాహనదారులు హెడ్ లైట్లు వేసుకొని జాగ్రత్తగా వెళ్తున్నారు. ఉదయం ఎనిమిది గంటలు దాటినా పొగమంచు ప్రభావం తగ్గడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల వేగం తగ్గించుకుని మెల్లగా వెళుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 30 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకునే ఫెసిలిటీ
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

