AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 రోజులు షుగర్ తినడం మానేస్తే మన శరీరంలో జరిగేది తెలిస్తే

10 రోజులు షుగర్ తినడం మానేస్తే మన శరీరంలో జరిగేది తెలిస్తే

Phani CH
|

Updated on: Jan 02, 2026 | 5:00 PM

Share

షుగర్ కట్ ఛాలెంజ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. చక్కెర వినియోగాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం ద్వారా బరువు తగ్గడం, శక్తి పెంచుకోవడం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. యాడెడ్ షుగర్‌కు దూరంగా ఉండటం వల్ల జీర్ణక్రియ, మానసిక స్థితి, చర్మ ఆరోగ్యం మెరుగుపడతాయి. సహజ చక్కెరలు హానికరం కావు, కానీ యాడెడ్ షుగర్ తగ్గించడం మంచి ఆరోగ్యానికి కీలకం.

ప్రస్తుత కాలంలో షుగర్ కట్ చాలెంజ్ ట్రెండ్ అవుతోంది. అంటే చక్కెర వినియోగాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం.. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలికి, బరువు తగ్గడానికి, శక్తి పెంచుకోవడానికి, మధుమేహం వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.. కానీ దీనిలో చక్కెర కోరికలను నియంత్రించడం, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం సవాలుగా ఉంటుంది.. అన్ని చక్కెర ఆహారాలను తగ్గించడం లేదా మానేయడం అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. భారతదేశంలో 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ టైప్ టు డయాబెటిస్ ఇన్సులిన్ నిరోధకత, ఉబకాయం, నాన్ ఆల్కహాలిక్ క్ ఫ్యాటీ లివర్ డిసీస్, గుండె జబ్బులు అనేక పరిణామాలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన శరీరానికి గ్లూకోజ్ అనే చక్కెర కచ్చితంగా అవసరం. మెదడు పనితీరుకు ఈ గ్లూకోస్ ఎంతో అవసరం. మొత్తం శరీరానికి శక్తినిచ్చే ప్రధాన వనరు ఈ గ్లూకోస్. కానీ మన ఆహారంలో గ్లూకోస్ ను బయట నుంచి కలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తినే ఆహారం నుంచి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులను విచ్చిన్నం చేయడం ద్వారా మన శరీరం దానికి అవసరమైన గ్లూకోస్ ను తయారు చేసుకోగలదు. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు వంటి కార్బోహైడ్రేట్లు ఉన్న అన్ని ఆహారాలలో చక్కెర సహజంగా కనిపిస్తుంది. సహజంగా చక్కెర ఉన్న ఆహారాలను తీసుకోవడం హానికరం కాదు. కానీ మనం తినే ఆహారంలో బయటి నుంచి షుగర్ యాడ్ చేయడం వల్ల అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ఈ బయటి నుంచి యాడ్ చేసే షుగర్ తగ్గించడం వల్ల చాలా స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. యాడెడ్ షుగర్ తగ్గించడం వల్ల మొదట్లో కొంత మందికి తలనొప్పి, అలసట మానసికంగా కొన్ని మార్పులు కనిపించడంతోపాటు.. భవిష్యత్తులో మంచి రిజల్ట్ కు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యం ఆరు రోజుల్లో మెరుగుపడుతుంది.. వారం రోజుల్లో మానసిక స్థితిలో మార్పు, పది రోజుల్లో చర్మం ప్రకాశవంతంగా మారడం ప్రారంభమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీర బరువులో మార్పులను గమనించడానికి కనీసం ఒక నెలపాటు షుగర్ కు దూరంగా ఉండాలని.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అని వైద్యులు అంటున్నారు. పెద్దలు రోజుకు 30 గ్రాములకు మించి యాడెడ్ షుగర్ తీసుకోవద్దని, రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్య పిల్లలు రోజుకు 14 గ్రాములకు మించి యాడెడ్ షుగర్ తినకూడదు. రోజువారి క్యాలరీలలో 10 శాతానికి పైగా ఉండకూడదు. ఐదు శాతానికి ఈ యాడేడ్ షుగర్ తగ్గిస్తే అదనపు ప్రయోజనాలు పొందవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది

ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం

Lunar Eclipse 2026: మార్చి 3న తొలి చంద్రగ్రహణం

కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్

క్రిస్మస్ సెలవులకి బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు