AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP, TS Heatwave: అప్పుడే భగ్గుమంటున్న భానుడు.. మరి ఏప్రిల్, మేలో ఎండలు ఎలా ఉండనున్నాయంటే?

రాష్ట్రంలో ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. మార్చి మొదట వారం నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటికెళ్తే చెమటలు కక్కిస్తున్నాడు. దీంతొ బయట అడుగు పెట్టేటాలంటేనే జనం భయపడుతున్నారు. ఇక ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో భానుడు ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం పదండి.

AP, TS Heatwave: అప్పుడే భగ్గుమంటున్న భానుడు.. మరి ఏప్రిల్, మేలో ఎండలు ఎలా ఉండనున్నాయంటే?
Andhra, Telangana Heatwave Alert
Anand T
|

Updated on: Mar 05, 2026 | 9:15 AM

Share

ఎండాకాలం ప్రారంభంలోనే భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలోనే మాడు పగిలే ఎండలు జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇక సమ్మర్ స్టార్టింగ్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని, దీంతోపాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

మార్చిలో ఈ జిల్లాలో మాడు పలిగే ఎండలు

ఇక మార్చి నెలలో ఏపీలోని శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉందని అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కవ రోజులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వెల్లడించారు.

ఏప్రిల్ మేలో ఈ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు

మార్చి నుంచి మే నెల వరకు చూసుకుంటే శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు తెలిపారు. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

ఇదిలా ఉండగా అటు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటు తెలంగాణలోనూ మార్చి నుంచి మే నెల వరకు దాదాపు అన్ని జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అధికారులు పేర్కొన్నారు. ఈ ఎండల దృష్ట్యా జనాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్