AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు.. అమలు ఎప్పటినుంచంటే..?

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందించింది. విద్యార్థులకు ఇప్పటివరకు బస్ పాస్‌ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో తక్కువ ధరకే ప్రయాణం చేసే సౌకర్యం అందుబాటులో ఉంది కానీ టెన్త్ పరీక్షల కారణంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల వేళ వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది.

Andhra Pradesh: ఏపీలో వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు.. అమలు ఎప్పటినుంచంటే..?
Apsrtc
Venkatrao Lella
|

Updated on: Mar 05, 2026 | 9:08 AM

Share

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఏపీలో టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. దీంతో పరీక్షల నిర్వహణకు ఇప్పటికే విద్యాశాఖ ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసింది. ఎగ్జామ్ సెంటర్లలో సౌకర్యాలతో పాటు పరీక్షల నిర్వహణకు సంబంధించి సర్వం సిద్దం చేసింది. ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా ముందుగానే చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఊరట కలిగించేలా మరో డెసిషన్ తీసుకుంది. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించనుంది. ఈ మేరకు ఆర్టీసీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష రాసే విద్యార్థులందరికీ ఈ అవకాశం దక్కనుంది. దాదాపు 6.42 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరందరూ ఆర్టీసీ బస్సుల్లో పరీక్షలు ముగిసేంతవరకు ఉచితంగా వెళ్లవచ్చు.

ఈ బస్సుల్లోనే ఫ్రీ బస్

కేవలం మూడు రకాల బస్సుల్లోనే టెన్త్ విద్యార్థులు ఫ్రీగా వెళ్లవచ్చు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కండక్టర్లకు టెన్త్ హాల్ టికెట్ చూపించి ఈ సౌకర్యం ఉపయోగించుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు, తిరిగి పరీక్ష కేంద్రం నుంచి ఇంటికి వెళ్లేందుకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతిస్తారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.

ఈ రోజు హాల్ టికెట్లు విడుదల

గురువారం పదో తరగతి హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేయనంది. ఉదయం 11 గంటలకు వీటిని ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. దీంతో విద్యార్థులు ప్రభుత్వం బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.bse.ap.gov.inలోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే వాట్సప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 సాయంతో కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇక విద్యాశాఖకు సంబంధించిన లీవ్ యాప్ నుంచి కూడా హాల్ టికెట్లను పొందవచ్చు. అటు ఈ నెల 12వ తేదీ నుంచి కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్, 7 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లను కల్పించనున్నారు. ఏప్రిల్ 1 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏప్రిల్ 13న అర్హుల జాబితా విడుదల చేస్తారు.

Follow Us
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్
15 ఏళ్లకే టీమిండియాలోకి సూర్యవంశీ.. సచిన్ రికార్డు బ్రేక్