AP: కెనడా నుంచి వెనక్కొచ్చిన పార్శిల్‌పై అనుమానం.. లోపల ఏముందని చెక్ చేయగా మైండ్ బ్లాంక్.!

తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ డ్రగ్స్‌ కలకలం రేపాయ్‌. బెంగళూరులో పట్టుబడిన డ్రగ్స్‌ తీగ లాగితే, దాని డొంక విజయవాడలో బయటపడింది.

AP: కెనడా నుంచి వెనక్కొచ్చిన పార్శిల్‌పై అనుమానం.. లోపల ఏముందని చెక్ చేయగా మైండ్ బ్లాంక్.!
Parcel Drugs
Follow us

|

Updated on: May 03, 2022 | 9:51 AM

తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ డ్రగ్స్‌ కలకలం రేపాయ్‌. బెంగళూరులో పట్టుబడిన డ్రగ్స్‌ తీగ లాగితే, దాని డొంక విజయవాడలో బయటపడింది. దాంతో, ఏపీ రాజధాని ప్రాంతంలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. విజయవాడ DTS కొరియర్‌ నుంచి ఆస్ట్రేలియాకు కొరియర్ వెళ్లింది. అయితే, ఆ కొరియర్‌పై డిటైల్స్‌ సరిగా లేకపోవడంతో అది కెనడాకు వెళ్లిపోయింది. కెనడా నుంచి వెనక్కి వస్తుండగా బెంగళూరులో పార్శిల్‌ను చెక్‌ చేయడంతో డ్రగ్స్‌ భాగోతం బయటపడింది. ఈ కొరియర్‌ను పంపింది పల్నాడు జిల్లా సత్తెనపల్లి వాసిగా గుర్తించారు పోలీసులు. చెన్నై కేంద్రంగా ఈ ఎపిడ్రిన్‌ను తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఎపిడ్రిన్‌కు కొన్ని కెమికల్స్‌ కలిపి డ్రగ్‌గా మార్చుతున్నట్లు గుర్తించారు.

విజయవాడ డ్రగ్స్‌ కేసులో పురోగతి సాధించారు ఏపీ పోలీసులు. కొరియర్‌లో ఉన్న డ్రగ్‌ను ఎపిడ్రిన్‌గా గుర్తించారు. బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేసిన తేజను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అనుమానితులుగా చేర్చారు. గోపీసాయి ఆధార్‌ కార్డుపై ఈ కొరియర్‌ వెళ్లింది. అయితే, ఆధార్‌ కార్టులో ఫొటోను మార్ఫింగ్‌ చేసినట్లు గుర్తించారు. కస్టమర్‌ ఇచ్చిన ఆధార్‌ కార్డు సరిగా లేకపోవడంతో తన ఆధార్‌తో పార్శిల్‌ను బుక్‌ చేశాడు తేజ. పార్శిల్‌లో ఇచ్చిన నెంబర్‌కు ఫోన్‌ చేస్తే, ఓ మహిళ మాట్లాడింది. పొంతనలేని సమాధానాలు చెప్పిన మహిళ, ఆ తర్వాత ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసింది.

విజయవాడ డ్రగ్స్‌ కేసులో కొత్త విషయాలు బయటికి వస్తున్నాయ్‌. ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయ్‌. గోపీసాయి తప్పుడు ఆధార్‌ కార్డు ఇచ్చాడు. పైగా ఆధార్‌లో ఫొటో మార్ఫింగ్‌ చేశాడు. గోపీసాయి ఇచ్చిన ఆధార్‌ కార్డు సరిగా లేకపోవడంతోనే తన ఆధార్‌పై పార్శిల్‌ పంపానంటున్నాడు తేజ. పైగా పార్శిల్‌ చేయడానికి తన భార్యను కొరియర్‌కు ఇచ్చాడు గోపీసాయి. ఇవన్నీ అనుమానాలకు కలిగిస్తున్నాయ్. అదే సమయంలో కొరియర్ సంస్థపైనా డౌట్స్‌ రైజ్ అవుతున్నాయ్‌. రివర్స్‌ వచ్చిన కొరియర్‌ను రికవరీ చేసుకోవడానికి తేజను ఎందుకు బెంగళూరు పంపిందనేది మిస్టరీగా మారింది. అయితే, కొరియర్‌ ఉద్యోగి తేజకు ఈ డ్రగ్స్‌లో ఎలాంటి సంబంధం లేదంటున్నాడు అతని బావ కరుణాకర్‌. కొరియర్‌ సంస్థ పంపడంతోనే తేజ… బెంగళూరు వెళ్లాడని తెలిపాడు. అక్కడకు వెళ్లాక, ఏమీ చెప్పకుండా రెండ్రోజులపాటు తేజను నిర్బంధించారని చెప్పుకొచ్చాడు.

Also Read:

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.