Border Dispute: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న కొత్త పంచాయితీ.. బార్డర్ టోల్‌ ప్లాజా దగ్గర హైడ్రామా!

తెలుగు రాష్ట్రాల మధ్య బోర్డర్‌ వార్ కంటిన్యూ అవుతోంది. తమకున్న సూచనల మేరకు పక్క రాష్ట్రాల ధాన్యాన్ని తెలంగాణలోకి అడుగు పెట్టనివ్వమంటున్నారు రాష్ట్ర పోలీసులు. నిన్న రాత్రి ఫుల్లురు టోల్‌ ప్లాజా దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది.

Border Dispute: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న కొత్త పంచాయితీ.. బార్డర్ టోల్‌ ప్లాజా దగ్గర హైడ్రామా!
Border Dispute
Follow us
Balaraju Goud

|

Updated on: May 03, 2022 | 9:52 AM

Inter-state Border Dispute: తెలుగు రాష్ట్రాల మధ్య బోర్డర్‌ వార్ కంటిన్యూ అవుతోంది. తమకున్న సూచనల మేరకు పక్క రాష్ట్రాల ధాన్యాన్ని తెలంగాణలోకి అడుగు పెట్టనివ్వమంటున్నారు రాష్ట్ర పోలీసులు. నిన్న రాత్రి ఫుల్లురు టోల్‌ ప్లాజా దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది. సరిహద్దులో పక్క రాష్ట్రం ధాన్యం నిలిపివేశారు పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లా ఫుల్లుర్ టోల్ ప్లాజా దగ్గర తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు పోలీసులు. తెలంగాణలో కొనుగోలు ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. ఏపీ, కర్ణాటక రాష్ట్ర వరి ధాన్యం లారీలను వెనక్కి పంపుతున్నారు.

యాసంగి ధాన్యం కొనుగోలు కోసం కేంద్రంపై పెద్ద ఎత్తున సమరం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి తీసుకువచ్చింది. అయినా కేంద్రం నుంచి స్పష్టత రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేపట్టింది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల ధాన్యం రానివ్వరాదన్నది ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్రంలో 36 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా. ఏప్రిల్‌ మొదట్లో సీఎం కేసీఆర్ ఆదేశించిన వెంటనే చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వరి ధాన్యం కొనుగోళ్లతో రాష్ట్ర ఖజానాపై దాదాపు 5 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందన్న అంచనాలున్నాయి. దీంతో సరిహద్దులో ఇతర రాష్ట్రాల ధాన్యం రాకను నిలిపివేస్తున్నారు పోలీసులు.

వాస్తవానికి సూర్యాపేట ప్రాంతంలో అత్యాధునిక రైస్‌ మిల్లులు చాలా ఉన్నాయి. దీంతో ధాన్యం అక్కడికి పెద్ద మొత్తంలో దిగుమతి అవుతుంటుంది. ఈ క్రమంలో వ్యాపారులు ధాన్యం పంపిస్తుంటారు. అయితే పోలీసులు మాత్రం ససేమిరా అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ధాన్యం రావడానికి వీల్లేదని అంటున్నారు.

దాచేపల్లి చెక్‌పోస్టు మొదలు ఫుల్లుర్ వరకు అన్ని చోట్ల చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసి.. పక్క రాష్ట్రాల ధాన్యం నిలిపివేస్తున్నారు. కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ల నుంచి సరుకు వచ్చే అవకాశం ఉండటంతో తెలంగాణ నలుదిక్కులా 51 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏపీలో తక్కువ ధరకు పంట కొని.. తెలంగాణలో ఎక్కువకు అమ్ముకునేందుకు వ్యాపారులు చేస్తున్న ప్రయత్నానికి పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు.

Read Also… My Home: మైహోం సంస్థకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు.. తెలంగాణ కార్మికశక్తి అవార్డు అందించిన సర్కార్