Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palm Wine In Bamboo: వేసవి దాహార్తి తీర్చుకోవడానికి సరికొత్త పానకం. బొంగులో కల్లు కోసం బారులు తీరుతున్న జనం

Palm Wine In Bamboo: కల్లు ఇది ఒక రకమైన ఆల్కహాలు. కల్లు పామే కుటుంబానికి చెందిన చెట్ల నుండి తీస్తారు. ఇది చిక్కని, తెల్లని ద్రవం. కల్లును ఆఫ్రికా ఖండం (Africa Continent), దక్షిణ భారత దేశం..

Palm Wine In Bamboo: వేసవి దాహార్తి తీర్చుకోవడానికి సరికొత్త పానకం. బొంగులో కల్లు కోసం బారులు తీరుతున్న జనం
Palm Wine In Bamboo
Follow us
Surya Kala

|

Updated on: May 03, 2022 | 10:21 AM

Palm Wine In Bamboo: కల్లు ఇది ఒక రకమైన ఆల్కహాలు. కల్లు పామే కుటుంబానికి చెందిన చెట్ల నుండి తీస్తారు. ఇది చిక్కని, తెల్లని ద్రవం. కల్లును ఆఫ్రికా ఖండం (Africa Continent), దక్షిణ భారత దేశం (South India), ఫిలిప్పీన్స్ మొదలైన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈత కల్లు, తాటి కల్లు, కొబ్బరి కల్లు, అత్తి కల్లు వంటి రకరకాల కల్లులు గురించి అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణంగా కల్లుని ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణలో ఇంట్లో శుభకార్యాలు ఉన్నా, స్నేహితులతో పార్టీ చేసుకోవాలనుకున్నా కల్లుకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. కల్లు కోసం క్యూలు కడతారు. కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. అయితే ఇప్పుడు తాటికల్లు, ఈతకల్లులతో పాటు మరికొక కల్లుని ఇష్టంగా తాగుతున్నారు. ఆ కల్లు ఏమిటో తెలుసా బొంగులో కల్లు. అవును మీరు విన్నది నిజమే. అదేంటి ఇప్పటి వరకూ బొంగులో చికెన్ గురించి విన్నాం.. ఇప్పుడు బొంగులో కల్లు ఏమిటా అని అనుకుంటున్నారా.. తాజాగా బొంగులో కల్లు ప్రస్తుతం తెలంగాణలో ట్రెండ్. ఈ కల్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొరుకుంటుంది.

జిల్లాలోని అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో గౌడన్నలు బొంగులో కల్లుని తీస్తున్నారు. ఒక్కో తాటి చెట్టుకు మట్టి కుండలకు బదులు.. పదుల సంఖ్యలో వెదురు బొంగులు పెట్టారు. అప్పుడు చెట్టు నుంచి వచ్చే కల్లు  బొంగుల్లోకి చేరుతుంది.. అనంతరం కిందకు దించుతారు. అయితే ఇలా వెదురు బొంగులో నుంచి తయారు చేసిన కల్లు.. మట్టి కుండల కల్లు కంటే రుచిగా ఉంటుందని చెబుతున్నారు.

ఎండాకాలం కావడంతో కుండలో కన్నా వెదురు బొంగులో కల్లు చల్లగా ఉంటుందని అలాగే టెస్ట్ కూడా చాలా భిన్నంగా ఉందని కల్లు ప్రియులు చెబుతున్నారు. అందుకనే ఈ బొంగులో కల్లుకు మంచి డిమాండ్ ఏర్పడింది. బారులు తీరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజున వివాహం చేసుకోవడం ముఖ్యంగా కుజదోషం ఉన్నవారికి శుభప్రదం.. ఎందుకంటే..

India Gold Demand: మూడునెలలుగా భారీగా తగ్గిన బంగారం కొనుగోళ్లు.. కారణాలేమిటంటే..