India Gold Demand: మూడునెలలుగా భారీగా తగ్గిన బంగారం కొనుగోళ్లు.. కారణాలేమిటంటే..

India Gold Demand: భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండగ, ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఇలా సందర్భంగా వచ్చినా సరే.. వెంటనే తమ స్తాయికి తగినట్లు బంగారం..

India Gold Demand: మూడునెలలుగా భారీగా తగ్గిన బంగారం కొనుగోళ్లు.. కారణాలేమిటంటే..
India Gold
Follow us
Surya Kala

|

Updated on: May 03, 2022 | 9:48 AM

India Gold Demand: భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండగ, ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఇలా సందర్భంగా వచ్చినా సరే.. వెంటనే తమ స్తాయికి తగినట్లు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. బంగారం హోదాకు చిహ్నంగా భావించడమే కాదు.. భవిష్యత్ కు ఆర్ధిక భద్రతనిస్తుందని.. ఎప్పుడైనా అవసరం ఏర్పడినప్పుడు ఆదుకుంటుందని నమ్మకం. అయితే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ లో పసిడి కొనుగోళ్లు భారీగా తగ్గాయని తెలుస్తోంది.

ద్రవ్యోల్బణం, అధిక బంగారం ధరల ప్రభావం పసిడి కొనుగోళ్లపై చూపినల్టు  ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (WGC) తెలిపింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారాం కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. దీంతో పసిడి డిమాండ్ 18 శాతం తగ్గి 135.5 టన్నులకు పడిపోయింది. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం 2021లో బంగారం డిమాండ్ 26 శాతం 94.2 టన్నులు ఉంది. అయితే 2021తో పోలిస్తే.. 2022 మొదటి మూడు నెలల్లో డిమాండ్ 165.8 టన్నులుగా ఉంది.

2021 నాల్గవ త్రైమాసికంలో రికార్డు స్థాయికి పెరిగిన తర్వాత, బంగారు ఆభరణాల డిమాండ్ ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 26 శాతం తగ్గి 94 టన్నులకు పడిపోయింది. 2010 నుండి.. మహమ్మారి సమయంలో మినహాయించి, ఇది కేవలం మూడోసారి మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్ మొత్తం 100 టన్నుల కంటే తక్కువగా ఉంది” అని సోమసుందరం చెప్పారు.

అయితే  ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరిగాయని బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ ANIతో చెప్పారు. అంతేకాదు మరోవైపు బంగారం కొనుగోళ్లపై వినియోగదారుల బడ్జెట్ కూడా తగ్గిపోయిందని ఆయన అన్నారు.

వినియోగదారుడు తేలికపాటి ఆభరణాలను రూ. 50,000 ధరకు కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపించేవారు. అయితే ఇప్పుడు బంగారం ధర రూ. 55,000లకు చేరుకుంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనే ఆసక్తి కస్టమర్ లో  తగ్గిపోయిందని  సింఘాల్ చెప్పారు. ఎప్పుడైతే ధర రూ. 50 వేలకు దిగువకు చేరుకుంటుందో.. అప్పుడు మళ్ళీ వినియోగదారులు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి మార్కెట్‌లోకి వస్తారని చెప్పారు. ఇంతకుముందు అక్షయ తృతీయ సందర్భంగా పసిడికి డిమాండ్ ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం గోల్డ్ మార్కెట్లు ఖాళీగా ఉన్నాయని, బంగారం ధరలు పెరగడమే ఇందుకు కారణమని సింఘాల్ చెప్పారు.

COVID-19 మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి.. ఆభరణాల మార్కెట్‌పై ప్రభావం చూపిందని ఆయన అన్నారు. “పరిస్థితి మెరుగయ్యే వరకు, మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని చెప్పారు. అంతేకాదు ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగిస్తే బంగారం ధర రూ.2,000 నుంచి రూ.4,000 వరకు తగ్గే అవకాశం ఉందని సింఘాల్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

Also Read: 

Gold & Silver Cost Today: నేడు అక్షయ తృతీయ సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Kisan Drone Subsidy: రైతులకు శుభవార్త.. రూ. 5 లక్షలు సహాయం చేస్తున్న కేంద్రం.. ఎందుకోసమంటే..!