My Home: మైహోం సంస్థకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు.. తెలంగాణ కార్మికశక్తి అవార్డు అందించిన సర్కార్

ప్రముఖ సంస్థ మైహోమ్‌ మరో ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకుంది. తెలంగాణ కార్మికశక్తి అవార్డును దక్కించుకుంది.

My Home: మైహోం సంస్థకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు.. తెలంగాణ కార్మికశక్తి అవార్డు అందించిన సర్కార్
My Home Award
Follow us
Balaraju Goud

|

Updated on: May 03, 2022 | 8:33 AM

Telangana Karmika Shakti Award to My Home: ప్రముఖ సంస్థ మైహోమ్‌ మరో ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకుంది. తెలంగాణ కార్మికశక్తి అవార్డును దక్కించుకుంది. నిత్యం శ్రామికుల అభ్యున్నతికోసం పనిచేస్తున్న మై హోం సంస్థకు అవార్డు రావడంపై సంస్థ ప్రతినిధులు హర్షం ప్రకటించారు. సంస్థ తరఫున ఈ అవార్డును సీనియర్‌ ప్రెసిడెంట్‌ ఎంకే సాయి అందుకున్నారు. కార్మిక శక్తి అవార్డు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు సంస్థ ప్రతినిధులు. మేడే సందర్భంగా మైహోంకు ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు సంస్థ ప్రతినిధులు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థ సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Read Also…  Viral Photo: ఫుట్ పాత్‌పై చిన్నారి ఓ వైపు జీవితం కోసం చిరు ధ్యాన్యాలు అమ్మకం.. మరోవైపు భవిష్యత్ కోసం చదువు..